కేంద్రపాలిత ప్రాంతం గా విశాఖ…? కేంద్ర పరిశీలన లో ఉందంటూ ప్రచారం

విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు కేంద్రంలోని ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే సమాలోచనలు చేసింది.కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నాయకులు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ అంశం అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కీలక నగరంగా ఉన్న విశాఖ పట్నం పై ఆ తరహా ప్రచారం జరుగుతుంది. విశాఖపట్నం ని ఎందుకు కేంద్రపాలిత ప్రాంతం చేయకూడదు అనే చర్చ ఢిల్లీలో కొనసాగుతున్నట్లు భోగట్టా. విశాఖలో పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు ఉండటం. త్రివిధ దళాలకు సంబంధించి కీలక కార్యాలయాలు ఉండటం, దీనికి తోడు సుధీర తీర ప్రాంతం కావడం. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్ దేశాలతో శత్రుత్వంతో ఈ తీర ప్రాంతం ద్వారా విశాఖకు ముప్పు వాటిళ్లే అవకాశం ఉండటం దృష్ట్యా బీజేపీ కేంద్ర ప్రభుత్వం విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర బిజెపి నాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తమ నిర్ణయం తెలియజేసినట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజన ద్వారా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని విభజన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని ఇక్కడ ప్రజలు ఎంతో ఆశించారు. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఖరా ఖండిగా చెప్పేసింది. కేంద్రంపై ఈ విషయమే పోరాటం చేసే విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ముందుకు వెళ్లడం లేదు. స్వప్రయోజనాల కోసం ఈ పార్టీలు పెద్దగా ఏమీ చేయలేదని ప్రజలే విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాజధానుల రగడ కూడా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని టిడిపి, కాదు ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు వైసిపి వాదించుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ఇప్పటికే ప్రకటించింది.. పరిపాలన సాలభ్యం కోసం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనే మూడు రాజధానులు ఉండాల్సిందేనని వైసిపి గట్టిగా చెబుతుంది. ఈ రచ్చ ఇలా కొనసాగుతుండగానే విశాఖను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని మరో పక్క కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయనప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం స్పందించనప్పటికి అంతర్గతంగా ఈ అంశంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే నిజం అయితే విశాఖ ద్వారా లబ్ధి పొందాలని ఆలోచిస్తున్న ప్రాంతీయ పార్టీలకు తీవ్ర నష్టం జరగనుందన్నది వాస్తవం నేవీ, డిఫెన్స్, పోర్టు లాంటి సంస్థలు, సుధీర్ఘ సముద్ర తీరం పట్ల ఆకర్షితులైన కేంద్ర మంత్రులు ఈమేరకు ఓ ప్రతిపాదన పెట్టారనేది ఈ చర్చకు తెర లేచింది. దీనిపై ఇదివరకే కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు పరిశీలించి వెళ్ళారని, త్వరలో ఈ ప్రతిపాదన వెలుగు చూస్తుందని సమాచారం. కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దిల్లీ, పుదుచ్చేరి, అండమాన్-నికోబర్ దీవులు, దాద్రా-నగర్ హవేలీ, చంఢీగర్, డామన్-డయ్యూ, లక్షదీవులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్‌ యూటీలు కూడా ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంతాలు తొమ్మిది అవుతాయి. అయితే, దిల్లీ, పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా, మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిపాలించబడుతాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాలకున్న హక్కులు, అధికారాలు ఉండవు. దేశమంతటిలో విభిన్న చరిత్ర, సాంస్కృతిక వారసత్వము గల కొన్ని ప్రాంతాలను, భౌగోళికంగా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ప్రదేశాలను, అంతర్ రాష్ట్ర వివాదాల వలన కేంద్ర ప్రభుత్వం చే పాలించవల్సి వచ్చిన ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమిస్తుంది. ఆ అధికారి ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో విధాన సభలు ఉన్నాయి. అటువంటి ప్రాంతాలలో ముఖ్య మంత్రి పదవి కూడా ఉంటుంది. దిల్లీ, పుదిచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు శాసన సభ ఉంటుంది. ఎన్నుకున్న ఎమ్మేల్యేలు ఉంటారు. అయితే, ఎగువ సభ(విధాన సభ) ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. ఈయనను కేంద్రం నియమిస్తుంది. చట్టసభ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఒక విధంగా పాక్షిక రాష్ట్రం అని చెప్పొచ్చు. ఇక చెప్పొచ్చే విషయం ఏంటంటే ఒకవేళ విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తర్వాత ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనకు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాయకులు, ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు విశాఖ అంశంపై ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉన్నాయి. విభజన హామీల కోసం గట్టిగా నోరెత్తని ఈ పార్టీలు ఇక కేంద్ర పాలిత అంశంపై కేంద్రంపై పోరాటం చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఇక్కడ పార్టీలు తలోగ్గాలిసిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ వైసిపి, టిడిపి, జనసేన, వామపక్ష పార్టీలతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే ఈ అంశంపై బీజేపీ ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అంశంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More