ఆంద్రప్రదేశ్ లో వైస్సార్ సీపీ, తెలంగాణ లో వైస్సార్ టీపీ లకు గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తనయుడు జగన్ నాయకత్వం లోని వైస్సార్ సిపి కి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గత కొంతకాలం గా ఈ అంశం నలుగుతున్నప్పటికి పార్టీ ప్లీనరీ నేపథ్యంలో విజయమ్మ అంశం తెరపైకి వచ్చింది. సోదరి షర్మిల తోను తల్లి విజయమ్మ తోను విభేదాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రెండుపడవలపై ప్రయాణం కన్నా షర్మిల తోనే నడవాలని విజయమ్మ నిర్ణయించు కున్నట్టు తెలిసింది ఇదిలావుండగా విజయమ్మ రాజీనామా విషయం పై సిఎం జగన్ లేఖ రాసినట్లు సమాచారం. గతంలోను బ్రదర్ అనిల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కామెంట్ చేసిన విషయం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పాద యాత్రలు చేసి, జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి రాడానికి కారణం అయిన తల్లి విజయమ్మ ,సోదరి షర్మిల కూడా కారణం అన్న విషయం మార్చి పోకూడదని కొంత మంది గుర్తు చేసుకుంటున్నారు.