హీరో చియాన్ విక్రమ్ కు గుండెపోటు రావడంతో హుటాహుటిన చెన్నై లోని కావేరీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు. నిన్న సాయంత్రం పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ కు హాజరు కావల్సి ఉండగా అనారోగ్యానికి గురియైన అనంతరం హార్ట్ ఎటాక్ రావడం తో హాస్పిటల్ కు తరలించారు. ఎప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్ గా వుండే విక్రమ్ కు గుండెపోటు రావడం అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా విక్రమ్ కి ఛాతీ లో అసౌకర్యం మాత్రమే అని గుండెపోటు కాదని విక్రమ్ వ్యక్తిగత మేనేజర్ సూర్యనారాయణన్ తెలియజేసారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్యం బాగానే ఉందని ఈరోజే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.