రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో విశాఖ సౌత్ నియోజకవర్గం ఒక అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.. పోలైన ఓట్ల లో 70.24 శాతం ఓట్ల తో విజయం సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.తెలుగుదేశం పార్టీ కి గట్టి పట్టున్న ఈ నియోజకవర్గం పొత్తు లో భాగంగా జనసేన కు కేటాయించారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేసొచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఇక్కడ నుంచి పోటీ చేశారు. పోలయిన లక్షా 39 వేల 399ఓట్లు లో 97868 ఓట్లు(70.24 శాతం) సాధించి అత్యధిక శాతం ఓట్లు సాధించిన వ్యక్తి గా చరిత్ర లో నిలిచారు.అతి తక్కువ కాలంలో దక్షిణ నియోజకవర్గం ప్రజల మన్ననలు పొందిన వంశీ తనదైన శైలిలో సేవా దృక్పథం, నిజాయితీ పెట్టుబడిగా చేసిన ప్రచారం బాగా వర్కవుట్ అయింది.పోల్ మేనేజ్మెంట్ కూటమి వేవ్ బాగానే కలిసొచ్చాయి.. అదృష్టం బావుంటే ఏభై వేలు.. దురదృష్టం ఎదురైతే ముప్పై వేల ఓట్ల మెజార్టీ తో గెలుస్తానని ఫలితాలకు ముందే ధీమా వ్యక్తం చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకోవడం తోపాటు ప్రజాభిమాన నేతగా చరిత్రలో నిలిచిపోయే మెజార్టీ ని సాధించడం గొప్ప విషయం.. ఒకసారి పీఆర్పీ నుండి, రెండుసార్లు వైసీపీ నుంచి ఓటమి పాలయిన ఆయన కలిసొచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకుని ఒక్కడు గా గెలిచారు