అక్రమాస్తుల కేసులో సీబీఐ(CBI) విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ(YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవంతో అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి ఆమడ దూరం లో ఆగిపోవడంతో మిత్రపక్షాల సపోర్ట్ తో కేంద్ర ప్రభుత్వం నడవడం వలన చాలా సీబీఐ కేసులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జగన్ అక్రమ ఆస్తుల కేసులు విచారణ కు వచ్చే అవకాశం ఉంది . విచారణ వున్నా లేకపోయినా ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో సొంత ఖర్చులతో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి అయితే ఉంది.