తెలంగాణలో బీజేపీకి 6 నుంచి 9 సీట్లు, వస్తాయని అలాగే కేంద్రంలోబిజెపి ప్రస్తుత బలం 300 స్థానాలను కొనసాగించే అవకాశం ఉందని, ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లో దాని స్థానాల్లో ప్రభావవంతమైన తగ్గుదల కనిపించడం లేదని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ మరియు బిజెపిల మధ్య గట్టి పోటీ జరిగిందని ఈ రెండు పార్టీలు సగం సీట్లు గెలుచుకోగలవన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పక్షం అయినా రెండు ఎక్కువ లేదా తక్కువ సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా 2019లో కాషాయ పార్టీ దాదాపు 20 శాతం ఓట్లతో 4 సీట్లు గెలుచుకుని దాదాపు అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనపడిన శక్తిగా బీజేపీ, కాంగ్రెస్‌లకు చోటు కల్పించిందని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము బీఆరెస్ ప్రభావం చెప్పుకోదగ్గగా లేదని చెప్పుకొచ్చారు.. 2019 ఎన్నికల్లో దాదాపు 42 శాతం ఓట్లతో 17 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 119 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 39 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 64.93 శాతం ఓటింగ్ నమోదైంది. భువనగిరిలో అత్యధికంగా 76.47 శాతం పోలింగ్ నమోదు కాగా, అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీకి చెందిన మాధవి లత పోటీ చేస్తున్న హైదరాబాద్‌లో 46.08 శాతం నమోదైంది.