మరో రెండు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టబోతున్నట్టు మెజార్టీ సర్వే సంస్థలు స్పష్టం చేశాయి.. దాదాపు నలబై సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు ప్రకటిస్తే అందులో కేవలం ఐదు సర్వేలు మాత్రమే వైసీపీ అధికారం లోకి వస్తుందని ప్రకటించారు.. ఎన్నికల ఫలితాలకు ముందే వచ్చిన ఈ సర్వే లతో టీడీపీ మంచి జోష్ మీదుంది. అదే ఊపు తో త్వరలో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ కి పునర్వైభవం తీసుకురావాలని భావిస్తోంది.. ఈ మేరకు టీటీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించడం తో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. నాయకులు చెదిరిపోయిన కేడర్ అలాగే ఉండడం టీడీపీకి ప్లస్ పాయింట్ కానుంది. రాష్ట్ర విభజన అనంతరం కూడా టీడీపీ గణనీయమైన సీట్లు సాధించిన విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. నిన్న కాక మొన్న కసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ పగ్గాలు చేపట్టిన తరువాత మంచి జోష్ వచ్చిన టైంలో అధినేత అప్పటి పరిస్థితుల బట్టి ఆ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయం కారణం గా కాసాని పార్టీకి గుడ్ బై చెప్పారు.. అప్పటి నుంచి స్ధబ్దు గా ఉన్న పార్టీ నేతలకు నిజంగా ఇదో తీపి కబురనే చెప్పాలి. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగు తమ్ముళ్లు రెడీ అవుతున్నారు. ఏపీ లో మాదిరిగా జనసేన, బీజేపీ లతో కలసి కూటమి గా ముందుకెళ్తారా లేదా సింగిల్ గానే వెళ్తారా అన్నది ఇంకా ఫైనల్ కాలేదు.. బీజేపీ తెలంగాణ లో బలం గా ఉన్న కారణంగా టీడీపీ తో కలసి వెళ్లే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాదాపుగా జనసేన టీడీపీ కలిసి వెళ్లే అవకాశాలు గట్టిగా ఉన్నాయని చెప్తున్నారు.. గతం లో టీఆర్ ఎస్(ఇప్పటి బీఆరెస్) చూసినట్టుగా అధికార కాంగ్రెస్ టీడీపీ ని శత్రువు గా భావించే అవకాశం లేదని చెప్తున్నారు.. తెలంగాణ మళ్ళీ టీడీపీ జండా రెపరేప లాడటానికి ఇదే మంచి సమయమని అంటున్నారు.. ఏపీ లో టీడీపీ అధికారంలోకి వస్తే రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహ పూర్వకం గా వుండే అవకాశాలే ఎక్కువున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.