ఆకతాయిలు విసిరిన రాయి అనుకుంటే అదో అంతరిక్ష శిల..

ఈ భూమ్మీద ఏదోచోట ఊహించని వింతలు జరుగుతూ ఉంటాయి. నమ్మశక్యం కానీ ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటికోసం మనం ఆసక్తిగా చర్చించుకోవడం కూడా జరుగుతుంది. ఇటువంటి సంఘటనే ఇటీవల అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో జరిగింది. అంతరిక్షం నుంచి దూసుకు వచ్చిన ఓ శిల వేగానికి ఓ ఇంటి పడక గదిలోని కలప గచ్చు ధ్వంసమయ్యింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ శిల బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల అంటే దాదాపు ఒక కిలో బరువు ఉన్నట్లు గుర్తించారు. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడుతు ఉండటం మనం వింటూనే ఉంటాం. ఇలాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతుల్లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాన్‌డ్రైట్‌ అంతరిక్ష శిల(గ్రహ శకలం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్‌వెల్‌ టౌన్‌షిప్‌లో ఇటీవలే జరిగిన ఈ సంఘటన పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్‌ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొకలోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు ‘ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ’ సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌తో క్షుణ్నంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్‌ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్‌ ఆఫ్‌ న్యూజెర్సీ ఫిజిక్స్‌ డిపార్టుమెంట్‌ చైర్మన్‌ నాథన్‌ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్‌ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More