చిన్న సినిమాకు పెద్ద కష్టమొచ్చింది …?

గతమెంతో ఘనం… వర్తమానం అగమ్యఘోచరం… భవిష్యత్ శూన్యం… ఈ మాటలు అక్షరాల తెలుగు సినిమాకు మరి ముఖ్యంగా చిన్న, మద్యతరహా సినిమాలకు నూటికి నూరు శాతం వర్తిస్తుంది… కరోన శకం ప్రారంభం అయిన తరువాత చిన్న సినిమా అన్నివర్గాల మద్య నలిగిపోతూ రేపెంటో అర్ధం కాక బిక్కచూపులు చూస్తోంది… పరిశ్రమ లో ప్రత్యక్షంగా, పరోక్షంగా, కార్మికులకు అధికశాతం ఉపాధి కల్పించేవి చిన్నసినిమాలే అన్నది నిర్వివాదాంశం.. యేటా సినీపరిశ్రమ కల్పించే ఉపాధి లో పెద్దసినిమాల వాటా కేవలం ఇరవై శాతం మాత్రమే (ఆదాయంలో కాదు). ఇక్కడి కళాకారులకు గాని , సాంకేతిక నిపుణులకు గాని , మిగిలిన కార్మికవర్గాలకు గాని సంవత్సరం పొడవునా మిగిలిన ఆదాయ మార్గం చిన్నసినిమాలే.. అలాంటి చిన్న సినిమాకి ఇప్పుడు కొండంత కష్టం వచ్చిపడింది. భారతదేశానికి తోలిసారిగా 2020 లో పరిచయమైన కరోనా వైరస్ అన్నీ రంగాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.. చాలా రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా సినిమారంగం మాత్రం కోలుకుంటున్నట్లు నటిస్తోంది… ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అన్నట్టు ఇప్పుడు చూడకపోతే ఎదో మిస్ అయిపోతామ్ అన్న ఫీలీంగ్ సగటు ప్రేక్షకుడికి ఇవ్వడం కోసం వందలకోట్ల కలెక్షన్లంటూ ప్రజలను మోసం చేస్తుంటామంటూ చెప్పిన మాటలు ఎప్పుడు విన్నా నిజమే అనిపించకమానదు … అయితే కొద్ధో.. గొప్పో కొన్ని చిత్రాలు మంచి టాక్ తెచ్చుకున్నా కనీసం బ్రేక్ ఈవెన్ కి కూడా రాలేదన్నది దాచిపెట్టిన నిజం… దాదాపు అన్ని చిన్న సినిమాలు జీరో కలెక్షన్స్ తో తమ ప్రస్థానాన్ని ముగించాయి. స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల దగ్గరకు చేరుతున్నాయి.. అలాంటి సేలబుల్ ఫేస్ ల చిత్రాలు కూడా ఒక్క షో తోనే చాప చుట్టేశాయి.. . నిజానికి ఒకట్రెండు చిత్రాలు మినహా అన్నిటిది ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ లో సినిమాకు వెళ్ళడం అవసరమా…? ఓ నాలుగు రోజులాగితే ఏదో ఒక ఓటిటీ లో వస్తుంది కదా అన్న ప్రజల ఆలోచనా విధానం కూడా ప్రజలకి సినిమా దూరమవడానికి ప్రధానకారణం.. ధియేటర్లలో కాక పోయినా కనీసం ఓటిటీ లన్నా ఆదుకుంటాయన్న భ్రమల్లో పుంఖానుపుంఖాలుగా సినిమాలు తీసేసి కూర్చున్నా చిన్న నిర్మాతలకు ఓటిటీ (ఓవర్ ద టాప్) ల కొత్త నిర్ణయం గోరు చుట్టు పై రోకలిపోటు లా మారింది.. డిజిటల్ రిలీజ్ చేసుకుని బయటపడొచ్చాన్న ఆశతో ఉన్న నిర్మాతలకి ఇది గట్టి దేబ్బే.. పెద్ద హీరో లవి, పెద్ద బేనర్ లవి తప్పా దాదాపుగా ఎక్స్క్లూసివ్ ( ఓన్లీ ఓటిటీ రిలీజ్) గా విడుదల చేసేందుకు అన్నీ ఫ్లాట్ఫామ్ లు విముఖత చూపిస్తున్నాయి… కొన్ని దియేటర్లలో నైన ప్రదర్శిస్తే తప్పా తాము తీసుకునేది లేదని క్లియర్ గా చెప్పేస్తున్నాయి. కోటినుంచి మూడు నాలుగు కోట్ల రూపాయిల పెట్టుబడి తో తీసిన వందలాది చిత్రాలు ఓటిటీల ముందు క్యూ కట్టి వున్నాయి.. వడ్డీల సంగతి దేవుడెరుగు పరువు దక్కితే అంతే చాలు అన్న పరిస్థితి కి నెట్టివేయబడ్డారు గతంలో ఎటువంటి షరతులు లేకుండా షేరింగ్ ఆప్షన్ కి ఓకే చెప్పిన ఓటిటీలు ఇప్పుడు షేరింగ్ విదానానికి కూడా అనేక షరతులను విధించడం చిన్న నిర్మాతలకు తగిలిన పెద్ధ దెబ్బ.. సక్సెస్స్ తాలూకా రూపం ఎప్పటికప్పుడు మార్చుకుంటున్న తెలుగు సినిమా గత నాలుగైదేళ్లలో చిన్న పెద్ద అన్న బారీకేడ్ ను కూడా చెరిపేసుకుంది.. కంటెంట్ బావుంటే కలెక్షన్ల మోతే అన్న స్వర్ణయుగం క్రియేట్ అయిన సమయం లోనే కోవిడ్ రూపం లో పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది… ఎన్నో దెబ్బలు మరెన్నో తప్పటడుగులు వేస్తున్న సినిమా, ఓ టి టి రంగాన్ని కొందరు గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుండడం మరో దెబ్బే. యు ట్యూబ్ పుణ్యామా అని వెలుగు లోకి వచ్చిన కొంతమంది ఓ టి టి సంస్థలలో తమకున్న పలుకుబడి ని వుపయోగించుకుని చిన్న నిర్మాతలతో గేమ్స్ మొదలుపెట్టారు… కొన్ని పెద్ద నిర్మాణ సంస్థల తోను వారికి సత్సంభందాలు ఉండడం తో పెద్ద చిత్రాలు కూడా వాళ్ళే డీల్ చెయ్యడం వలన ఓ టి టి సంస్థ లలో సైతం వీరి మాట చెల్లుతుండాన్ని అవకాశం గా తీసుకుని మీడియెటింగ్ ని విస్తరించారు.. వీళ్ళని దాటి వెళ్ళే అవకాశం లేకపోవడం తో చిన్న నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు… అలాగే కొంతకాలం క్రితం వరకు ఆదుకున్న హింది మార్కెట్ లోనూ స్థబ్ధత నెలకొని ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్నట్టు తయారయింది… ఓ వైపు ప్రభుత్వ విధానాలు.. మరోవైపు మీడియేటర్ల పర్సంటేజులు… ఇంకోవైపు అప్పులోళ్ల వేదింపులు చిన్న సినిమా నిర్మాత ని చంపేస్తున్నాయి… ఇదే విదానాలు మరి కొన్నాళ్లు కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమ తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొక తప్పదు.. *****

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More