తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రటేరియట్ లో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి మరికొంత సమయం పట్టేటట్టుంది. ఈ ఏడాది సంక్రాంతి తరువాత జనవరి 18 నుంచి ఇక్కడి నుంచే పాలన జరిగేందుకు ముహూర్తం పెట్టినప్పటికి పనులు ఇంకా పూర్తవ్వకపోవడం, ఇతర కారణాలతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 17 ఉదయం 11:30 , 12:30 మధ్యన ప్రారంభం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరు కావాల్సిఉంది.. అతిరథమహారధుల సమక్షంలో నూతన సచివాలయం జాతికి అంకితం కానుందుని గట్టిగానే ప్రచారం జరిగింది అయితే శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం కేంద్ర ఎన్నికల సంఘం సచివాలయ ప్రారంభం ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని చెప్పడం వంటి కారణాలతో ఓపెనింగ్ వాయిదా పడిందని అధికారికంగా చెబుతున్నప్పటికీ వాయిదాకు దీన్ని కుంటి సాకుగా ఎన్నుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు జరగలేదని.. దానికి తోడు ఇటీవల 5 6 అంత స్తులు అగ్నిప్రమాదం జరగడం మళ్ళి వాటి పునర్నిర్మాణం వంటి ఇతర కారణాలతో ప్రారంభం వాయిదా పడింది అని చెప్తున్నారు. 2019 జూన్ 27న ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్న సెక్రటేరియట్ నిర్మాణం కేవలం 44 నెలలోనే పూర్తి చేశారు 26.29 ఎకరాలు విస్తీర్ణంలో 11.45 లక్షల చదరపు అడుగుల ఈ నిర్మాణపు ఎత్తు 278 అడుగులు మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా నిర్మించిన స్కై లాంజ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది.