Vaisaakhi – Pakka Infotainment

మూడో’స్సారి” ముహూర్తం

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రటేరియట్ లో ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి మరికొంత సమయం పట్టేటట్టుంది. ఈ ఏడాది సంక్రాంతి తరువాత జనవరి 18 నుంచి ఇక్కడి నుంచే పాలన జరిగేందుకు ముహూర్తం పెట్టినప్పటికి పనులు ఇంకా పూర్తవ్వకపోవడం, ఇతర కారణాలతో సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 17 ఉదయం 11:30 , 12:30 మధ్యన ప్రారంభం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ హాజరు కావాల్సిఉంది.. అతిరథమహారధుల సమక్షంలో నూతన సచివాలయం జాతికి అంకితం కానుందుని గట్టిగానే ప్రచారం జరిగింది అయితే శాసనమండలి ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం కేంద్ర ఎన్నికల సంఘం సచివాలయ ప్రారంభం ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని చెప్పడం వంటి కారణాలతో ఓపెనింగ్ వాయిదా పడిందని అధికారికంగా చెబుతున్నప్పటికీ వాయిదాకు దీన్ని కుంటి సాకుగా ఎన్నుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు జరగలేదని.. దానికి తోడు ఇటీవల 5 6 అంత స్తులు అగ్నిప్రమాదం జరగడం మళ్ళి వాటి పునర్నిర్మాణం వంటి ఇతర కారణాలతో ప్రారంభం వాయిదా పడింది అని చెప్తున్నారు. 2019 జూన్ 27న ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్న సెక్రటేరియట్ నిర్మాణం కేవలం 44 నెలలోనే పూర్తి చేశారు 26.29 ఎకరాలు విస్తీర్ణంలో 11.45 లక్షల చదరపు అడుగుల ఈ నిర్మాణపు ఎత్తు 278 అడుగులు మొత్తం 7 అంతస్తులు ఉన్నాయి సెక్రటేరియట్ లో ప్రత్యేకంగా నిర్మించిన స్కై లాంజ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అదృష్ట సంఖ్య ఆరు కావడంతో సీఎం చాంబర్ ఆరవ అంతస్తులోనే ఏర్పాటు చేశారు. నిజాం కట్టడాలను పోలి ఉందని మసీదు ఆకృతిలో ఉందని వచ్చిన విమర్శలకు అధికార పార్టీ నాయకులు సమాధానం ఇచ్చినప్పటికీ విమర్శలు దాడి మాత్రం ఆగలేదు ఈ నిర్మాణానికి రెండవ శాతకర్ణి నిర్మించిన 15 ఏళ్ల నాటి నీలకంఠేశ్వర ఆలయం (నిజామాబాద్) స్ఫూర్తి అని ప్రభుత్వ అధికారులు, చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్లు పొన్ని కన్సేసాలో, ఆస్కార్ జి కన్సేసాలో దంపతులు (ఆస్కార్ అండ్ పోన్ని ఆర్కిటెక్ట్స్) చెప్తున్నారు. రెండు ప్రారంభ ముహూర్తాలు మార్చుకున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవానికి మరో ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది అంబేద్కర్ జయంతి రోజున ఏప్రిల్ 14 మే దీని ప్రారంభించాలని అదే రోజున భారీ ఎత్తున బిఆర్ సభ కూడా జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టు సచివాలయం ప్రారంభం తర్వాతే ఎన్నికలకు కూడా వెళ్లాలని అనుకున్నట్టు తెలిసింది అయితే ఈసారి ముహూర్తమైన పక్కా అవుతుందా.. లేక మళ్ళీ వాయిదా పడుతుందా.. అన్న టెన్షన్ అధికార పార్టీ నాయకులు ఇప్పటికే మొదలైంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More