లడ్డు వివాదం అంశం బయటకు వచ్చి చాలా రోజులై అధికారికంగా సిట్ ఏర్పాటై విచారణ జరుగుతున్న నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీక్ష విరమణ సంధర్భంగా ప్రదర్శించిన రెడ్ బుక్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో
ఉత్కంఠ రేపుతుంది.. ఇది కూడా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ లాంటిదేనా..? లేకపోతే ఇది కేవలం సనాతన ధర్మానికి సంబంధించిదేనా… పవన్ కళ్యాణ్ చేతిలో రెడ్‌బుక్? ….బుక్ లో ఏముంది?…ఎవరి పేర్లు ఉన్నాయి?..ఏ అంశాలు ఉన్నాయి?…ఈ రోజు జరిగే వారాహి సభలో డిక్లరేషన్ ఇవ్వనున్నారా…?
నిన్నటిదాకా దేశమంతా మారుమోగిన లడ్డూ ప్రసాద వివాదాన్ని సైతం మర్చిపోయేలా చేసిన వారాహి డిక్లరేషన్‌లో ఏముందసలు..? దీని ద్వారా హైందవ సమాజానికి పవన్ ఇవ్వబోయే సందేశం ఏంటి..? వారాహి డిక్లరేషన్‌తో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చెయ్యబోతున్నారా..? ఇన్ని సందేహాలకు గురువారం తిరుపతిలో జరిగే వారాహి సభలోనే సమాధానం…. తిరుమలేశుడ్ని దర్శనం చేసుకుని.. శ్రీవారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర డిక్లరేషన్ పుస్తకాన్నుంచి.. ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు పవన్ నాలుగు మాడవీధుల్లో నడుస్తున్నప్పుడు కూడా పవన్ చేతిలో ఎర్రటి డిక్లరేషన్ పుస్తకం మీదే మీడియా అంతా ఫోకస్ చేసింది.ఇవాళ సాయంత్రం తిరుపతిలో జరిగే వారాహి సభలో హైలైట్ కాబోతోంది వారాహి డిక్లరేషన్. డిక్లరేషన్‌లో అంశాలను మాత్రం ఇప్పటివరకూ లీక్ చెయ్యలేదు. ఎలాంటి ముందస్తు సంకేతాలు ఇవ్వొద్దని పార్టీ నేతల్ని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది
సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని గతంలోనే మాటిచ్చారు పవన్. ఇప్పటికే ఉదయనిధి లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలతో సనాతన ధర్మం వివాదాస్పదమైంది. తాజాగా పవన్‌కల్యాణ్ సనాతన ధర్మానికి ఆధునిక నిర్వచనం ఏదైనా ఇస్తారా? సనాతన పరిరక్షణ కోసం ఎటువంటి గైడ్‌లైన్స్ ఇస్తారు..? పవన్ వారాహి సభ.. ఆయన చేతిలో మెరిసే వారాహి డిక్లరేషన్….ప్రకాశ్‌రాజ్ అండ్ అదర్స్‌కి వారాహి సభలో సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.