తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సుతిమెత్తంగా చురకలాంటించారు.ఇటీవల మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించిన సమయంలో పాలనా పరమైన అంశాలు రాజకీయ అంశాలతో పాటు వివాదాస్పద అంశాలను కూడా మీడియా వాళ్ళు కెలకడంతో రేవంత్ రెడ్డి కి చిర్రెత్తుకొచ్చింది.మీడియా వాళ్లపై ఇటువంటి ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా తనదైన శైలిలో సున్నితంగా సమాధానాలు చెబుతూ ప్రతి ప్రశ్నకు తగినట్టుగానే కౌంటర్లు ఇవ్వడం జరిగింది.తాము మీడియా కాబట్టి ఏదైనా అడగవచ్చు ఎంత లోతుకైనా వెళ్లి నిలదీయవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన ప్రతి మీడియా ప్రతినిధి తలొక్క ప్రశ్న వేయడం సాధారణమైనప్పటికీ కానీ చిక్కల్ల వివాదాస్పదమైన అంశాలను లేవనెత్తడమే ఇక్కడ రేవంత్ రెడ్డి అసహనానికి కారణమయ్యింది.గత ముఖ్యమంత్రి పదేళ్లపాటు అధికారంలో ఉన్నారు ఏనాడైనా మీడియా వారు సీఎం కేసీఆర్ ని వివాదాస్పద అంశాల కోసం నిలదీసి అడిగారా అంత సాహసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాదు అందుకే గతంలో కెసిఆర్ ఏం చెప్తే అది విని వెళ్లడమే తప్ప వివాదాస్పద అంశాలపై ఎవరు కూడా నోరు విప్పలేదని రేవంత్ రెడ్డి అన్నారు.కానీ నేడు మీడియా వాళ్ళు స్వేచ్ఛగా అన్ని అంశాలపై తనను ప్రశ్నలు అడగడం మార్పుకు సంకేతమే కదా అని తిరిగి ప్రశ్నించారు.