ఓక యదార్థ సంఘటన ఆధారంగా చేసుకుని ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేసి యువత నచ్చేలా ఆ వాస్తవ కథకు తెరరూపమిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయింది. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ అన్ని హంగులు జోడించి రూపొందించిన ఈ సినిమాకు శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మిస్తున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ లో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనాధ్ పులకరం మాట్లాడుతూ సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి చాలా బాగుంది, విజువల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, లవ్ స్టోరీ మనసుకు హత్తుకునే లా ఉంది అన్నారు, కచ్చితంగా మా సినిమా ని థియేటర్ లో చూసినప్పుడు ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు అని గట్టిగా నమ్ముతున్నాను అని అన్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శంకర్ పిక్చర్స్, సినిమా ని ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీస్ చేసిన టీసర్, మరియు రెండు పాటలు ట్రెండ్ అవుతున్నాయి, మా సినిమా ఖచ్చితంగా యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుందని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని నమ్ముతున్నాం అన్నారు.