భూమి వైపు ఒక గ్రహశకలం గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంది.. సుమారుగా సిటీ బస్సు అంత సైజ్ వుండే ఈ ఆస్టరాయిడ్,అత్యంత వేగం గా భూమి వైపు వస్తోంది.
7.07 మిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమికి అత్యంత సమీపంగా దాటిపోతుందని ఒక అంచనా. ఈ గ్రహ శకలానికి 2024 JP1 అని నామకరణం చేశారు. ఈ ఆస్ట్రాయిడ్ ప్రయాణిస్తున్న వేగం ఈ గ్రహశకల గమనాన్ని యునైటెడ్ స్టేట్స్, యూరప్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీల నెట్‌వర్క్ ద్వారా ట్రాక్ చేయడం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.. ఈ అబ్జర్వేటరీలు డేటాను పంచుకోవడానికి గ్రహశకలం యొక్క మార్గాన్ని నిర్ధారిస్తు శాస్త్రవేత్తలకు భూమికి సమీపంలో ఉన్న గ్రహశకలాన్ని దగ్గరగా అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.. భవిష్యత్తులో ఆస్టరాయిడ్ ప్రభావ నివారణ, ఉపశమనానికి, వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఇటువంటి సమాచారం చాలా కీలకం కానుందని వెల్లడించారు. నాసా(NASA)తో అంతర్జాతీయ భాగస్వామ్యం ఉన్న అనేక పరిశోధనా సంస్థలు ఈ 2024 JP1 ని గుర్తించడం , ట్రాక్ చేయడం కోసం ఉన్న వ్యవస్థలన్నిటిని పటిష్టం చేసాయన్నాయి గంటకు 14,400 కి.మీ వేగంతో భూమి వైపు దూసుకువస్తున్న
దీనిని శక్తివంతమైన టెలిస్కోప్‌లు మరియు అధునాతన ట్రాకింగ్ అల్గారిథమ్‌ల వాడకంతో, ఉల్కను గుర్తించి, దాని కక్ష్యను ఖచ్చితత్వంతో లెక్కించగలిగారు. ఈ గ్రహ శకలం గురించి ప్రజల ఆందోళన పడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.