పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టబోతున్నట్లు దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేయడం తో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే గా అసెంబ్లీలో లో అడుగు పెట్టడం ఖాయమైంది. గత ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెంది ప్రత్యర్ధులకు సెటైర్లు వేయడానికి అడ్డంగా దొరికాడు. కానీ ఈసారి సీన్ రివర్స్ ఆయింది..జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ క్యాడర్ మొత్తం పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు చివర వరకు ప్రయత్నాలు చేశారన్నది వాస్తవం.అయితే ఈసారి పవన్ కళ్యాణ్ కు టిడిపి, బిజెపి ఓట్లు కూడా కలిసి రావడం కాస్త ఊరటనిచ్చిందని చెప్పాలి. అయితే గ్రామీణ ప్రాంతాలతో పాటు నగరాలలో కూడా పట్టిష్టంగా ఉన్న తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ విజయానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది.పవన్ కళ్యాణ్ కు ఎక్కువగా ఓటింగ్ పోలయ్యేలా ప్రయత్నించిందని చెప్పవచ్చు.టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పిఠాపురం స్థానిక నాయకుడు వర్మ కూడా పవన్ కళ్యాణ్ కు పూర్తిగా సహకరించారుఅసలు టిడిపి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి వర్మను ప్రకటించారు.అయితే కూటమి ఏర్పడిన తర్వాత సీట్లు సర్దుబాటు సందర్భంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి వచ్చింది.తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది.టిడిపి పవన్ కళ్యాణ్ విజయానికి హనుమంతు పూర్తిగా సహకరించింది.అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబం నుంచి కూడా అతని కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జబర్దస్త్ నటులు కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది.వైసిపి అభ్యర్థి వంగా గీత విషయంలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది.ఆమె పార్టీ క్యాడర్ ఆమెకు పూర్తిగా సహకరించలేదు.అయినప్పటికీ ఆమె తన గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టింది దీనిలో భాగంగా పిఠాపురంలో కూడా ప్రచారాన్ని ప్రారంభించింది.కానీ అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ పై మొగ్గు చూపడం ప్రారంభించారు.ఈసారి పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని భావించారు.సర్వేలతోపాటు ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమని స్పష్టం చేశాయి.ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ విజయం సాధించాలని మెగా ఫ్యామిలీ ఆశిస్తుంది.గత ఎన్నికల చేదు అనుభవాల నేపథ్యంలో ఈసారి గట్టిగా కొట్టి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మెగా ఫ్యామిలీ కోరుకుంటుంది.అటు మెగాస్టార్ చిరంజీవి నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఈ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక మంత్రి పదవి తీసుకోవడం ఖాయం అన్నది ఇప్పటికీ కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది అమ్మ అంజనాదేవీ కోరిక అయినప్పటికి ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడే అంటూ ఇప్పటికే కూటమి వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.డిప్యూటీ సీఎం లేదా హోమ్ మినిస్టర్ గా భాద్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదిలా ఉండగా రాజకీయాలలో పూర్తిస్థాయిలో నిలబడలేక స్తబ్దుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ తనలాగా కాకుండా రాజకీయాలలో మరింత ఎత్తుకు ఎదిగి తమ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని భావిస్తున్నారు.2014లో పదవులు ఆశించకుండా టీడీపీ, బీజేపీ లకు సపోర్ట్ చేయడమే కాకుండా ఆ ఎన్నికలలో తను పోటీ చేయలేదు.2019లో టిడిపి తో విభేదాలు కారణంగా ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలు చెందాడు.ఈ సమయంలో బిజెపికి, టిడిపికి చెడింది. మళ్లీ ఆ రెండు పార్టీలను ఒకటి చేసి కూటమి తయారు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం కూటమికే అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. కూటమి విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయం అనేది తెలుస్తుంది.