టెక్నాలజీ యుగంలో ఫోటోలను సాక్ష్యాలు గా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఏ ఐ(AI) టెక్నాలజీ, డీప్ ఫేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వాడుతున్న ప్రస్తుత కాలంలో ఫోటోలు సాక్షాలుగా గుర్తించడం ఏంటని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయం పడింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించే విషయంలో తన మాజీ భార్యకు వివాహేతర సంబంధం ఉందని అందుకు సంబంధించి సాక్ష్యాలు గా సమర్పించిన ఫోటోలపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఓ జంటకు విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భార్య తన ఐదేళ్ల కుమార్తెకు కలిపి నెలకు 75000 చొప్పున భరణం చెల్లించాలని భర్తను ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టులు అప్పీలు చేయగా జస్టిస్ రాజీవ్ శక్ధేర్,అమిత్ బన్సాల్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోటోలను పరిశీలించి భర్త తరఫు న్యాయవాది సూచించినట్లుగా ఆ పిక్స్ లో ఉన్నది భార్యా కాదా అనేది స్పష్టంగా లేదంటూ డీప్‌ఫేక్‌ల యుగంలో జీవిస్తున్నందున ఈ ఫొటోలను ముఖ్య సాక్ష్యాలు గా పరిగణనలోకి తీసుకోలేమని భర్త తిరిగి ఫామిలీ కోర్ట్ ముందు మరో సాక్ష్యాధారాలతో ఈ అంశాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తన తీర్పులో పేర్కొంది. రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా వ్యభిచారం అంశాన్ని ఫ్యామిలీ కోర్టు ముందు లేవనెత్తవచ్చని హైకోర్టు పేర్కొంది.
భర్త తరఫున న్యాయవాది ప్రతీక్ గోస్వామి తన వాదనలు
వినిపిస్తూ ఫ్యామిలీ కోర్ట్ లో ఈ అంశం లేవనెత్తబడినప్పటికి తీర్పు వెల్లడించే టైం లో మాత్రం విస్మరించబడింది. అని కోర్ట్ కి విన్నవించారు. అయితే ఫోటోలు స్పష్టంగా లేవని డీప్ఫేక్ చిత్రాలు ఎక్కువ వస్తున్న తరుణంలో ఫోటోలను సాక్ష్యాలు గా గుర్తించడం ఫోటోగ్రాఫ్‌లపై ఆధారపడటాన్ని నిరాకరిస్తూ, డీప్‌ఫేక్‌ల ముప్పును వారి తీర్పులో ప్రస్తావించారు