దంపతులలో భర్త కి అరవై సంవత్సరాలు పూర్తయినప్పుడు చేసుకునే పండుగ షష్టిపూర్తి..,శష్యభ్ది పూర్తి..
పెళ్లి సాధారణంగా జరగాలి, షష్టిపూర్తి ఘనంగా జరగాలని పండితుల వాక్కు. షష్టిపూర్తి మంచి బంధాలు మరింత బలపడే ఒక అపూర్వ సందర్భం.
పూర్వకాలంలో పురుషుడు ఏ వేడుక చేసుకున్నా అది ధర్మపత్నీ కి కూడా జరగినట్టే అని భావించేవారు.. అందువల్ల స్త్రీలకు విడిగా షష్టిపూర్తి చేసుకునే ఆచారం పెట్టలేదు కానీ భార్త చేసుకునే షష్ఠి పూర్తి లో భార్య కూడా భాగస్వామే. జ్యోతిష్య శాస్త్ర అనుసారం సంపూర్ణ ఆయుర్దాయం అంటే 120 సంవత్సరాలు.
అందులో సగం అంటే 60 సంవత్స రాలు పూర్తి అయినప్పుడు చేసుకునేదే షష్టిపూర్తి.
అంటే ఒక మనిషి తన లైఫ్ లో ఫస్ట్ హాఫ్ పూర్తి చేసుకుని జరిగి పోయిన తన అరవై సంవత్సరాలలో జీవితంలో ముఖ్య ఘట్టాలనన్నింటినీ పూర్తి చేసుకుని తన జీవితంలోని సెకండ్ హాఫ్ ని ప్రారంభించే శుభ తరుణం. షష్ఠి పూర్తి రోజు. నిజానికి శారీరకంగా ఈ వయస్సులలో కాళ్ళు, చేతులు లాంటి బాహ్యావయవాలు, గుండె, ఊపిరితిత్తులు వంటి అంతరావయవాలు శారీరక యంత్ర పరికరాలలో పెనుమార్పులు కలుగుతాయి.. ఆ కుదుపులకు తట్టుకుని, మళ్ళీ శక్తిని పుంజుకోవటానికి చేసే శాంతి ప్రక్రియే ఈ షష్టిపూర్తి..
జ్యోతిషశాస్త్ర రీత్యా బృహస్పతి పన్నెండు సంవత్సరాల కొకసారి స్వస్థానానికి చేరుకుంటాడు. అలాగే శని కూడా 30 సంవత్సరాలకు ఒకసారి 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మ కాలంలో ఉన్న రాశికి
చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. మానవజీవితంలో జరిగేమార్పులన్నింటినీ శని, గురు గ్రహాల గోచారం ద్వారా తెలుసుకోవచ్చు.. ఈ రెండు గ్రహాలు తాము బయలుదేరిన రాశికి చేరుకోవటం తిరిగి జీవితం ప్రారంభమైనట్లు సంకేతం.
మనిషి పుట్టిన సంవత్సరం నుండి తెలుగు సంవత్సరాల ప్రకారం తిరిగి అదే పేరు గల సంవత్సరంలో మళ్లీ ప్రవేశించే రోజు షష్టిపూర్తి అని ప్రస్తావిస్తారు.. అంటే తన జీవిత కాలంలో ఒక సైకిల్ ముగిసిన కాలం ఈ షష్ఠి పూర్తి.. శాస్త్రోక్తంగా చేసే షష్టిపూర్తి వేడుకలో ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేసే యజ్ఞమే ఈ ఆయుష్కామన యజ్ఞము.
ఇది ఎలా చేస్తారంటే ఒక
తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీసి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు. వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం’ అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను, తిథులను, వారములను (నవగ్రహాలను, వారి ఆది ప్రత్యాది దేవతలను) సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనిని ఆవాహన చేస్తారు వీరికి అధిదేవతలు అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేసి వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ – ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని, మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరణములతో వేదయుక్తంగా ఈ కార్యక్రమం పూజా హోమాధులతో జరిపిస్తారు. అయితే ప్రతివారికీ మృత్యువు
60 వ యేట ఉగ్రరథునిగా,
70 వ యేట భీమరథునిగా,
78 వ యేట విజయరథునిగా
పొంచి ఉంటాడు అందుకే అపమృత్యు నివారణార్థం ఈ హోమాల్ని, జపాలని కుడా షష్టిపూర్తి సందర్భంగా నిర్వహిస్తారు. షష్టిపూర్తి అంటే ప్రతియేటా జరుపుకునే పుట్టినరోజు లాంటిది కానేకాదు.. శాస్త్ర సమ్మతమైన ఒక వేడుక..