మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్, విఎఫ్‌ఎక్స్, గేమింగ్‌ రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, టెక్నీషియన్స్‌ను ఒకటే చోటికి చేర్చి సందర్శకులకు పరిచయం చేసే ఇండియాజాయ్ సినిమాటికా ఎక్స్ పో మొదలైంది. గతేడాది ప్రారంభించిన అంతర్జాతీయ ప్రదర్శనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహా పలువురు ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సినిమాటికా ఎక్స్‌పో సెకండ్ ఎడిషన్‌ను హెచ్.ఐ.సి.సి నోవోటెల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఐటి శాఖ సహకారంతో.. సినిమా, టెక్నాలజీ, సృజనాత్మకత వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషయన్లను, ఫిలింమేకర్లను, సోనీ-యారీ-రెడ్ తదితర టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులను ఒకే చోట కలుసుకోవడానికి ఈ ఎక్స్‌పో వేదిక కానుంది. 2023లో జరిగిన సినిమాటికా ఎక్స్‌పోలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ‘కల్కీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ‘బాహుబలి-ఆర్ఆర్ఆర్’ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్, తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీజీ విందాతో సహా పలువురు సినీ ప్రముఖులు, టెక్నీషియన్స్ హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో అత్యాధునిక సినిమా పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను ప్రదర్శనకు ఉంచడంతోపాటు, సెమినార్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, కొత్త ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ అలరించనున్నాయి. సినీరంగానికి చెందిన యువ దర్శక నిర్మాతలు, విద్యార్థులు, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన వారికి ఈ ఈవెంట్ కు విచ్చేయడంతో ఎన్నో నూతన విషయాలపై అవగాహన కలుగుతుంది. ఈ ఎక్స్‌పోకు దాదాపు 30వేల మంది హాజరయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ తెలుగు కంటెంట్ క్రియేటర్స్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగు డీఎంఎఫ్).. సినిమాటికాతో కలసి, టెక్ దిగ్గజాలు మరియు కంటెంట్ క్రియేటర్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా కంటెంట్ క్రియేటర్ల నైపుణ్యాన్ని పెంపొందించడానికి కావల్సిన వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు తెలుగు డిఎంఎఫ్ నిర్వహించనుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇండస్ట్రీ ఎదుగుదలతో కీలక పాత్ర పోషిస్తున్నందున వారిని మరింత ప్రోత్సహించడానికి ‘క్రియేటర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ 2024’ ని కూడా ఇదే వేదిక నుంచి ప్రధానం చేయనున్నారు. ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాంగోపాల్ వర్మ గా
సందీప్ రెడ్డి వంగ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవి మాట్లాడుతూ నేను మొదలు పెట్టినప్పుడు సినిమా వేరు ప్రస్తుతం సినిమా వేరు. సినిమాకి సంబంధించిన విజువల్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి. ఇండియన్ సినిమా పెద్ద హైట్స్ చూస్తోంది. ఈ సినిమాటిక ఎక్స్పో సినిమా మీద పాషన్ తో వచ్చే ఎంతోమందికి ఒక మంచి వర్క్ షాప్ లాంటిదన్నారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ లు ప్రసంగించారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More