ఓటీటీ లోకి ‘మంజుమ్మల్ బాయ్స్’ ఎందులోనంటే..?

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా చెప్పుకునే సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’. సర్వైవల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. చిన్న బడ్జెట్ తో నిర్మితమైన ఈ మలయాళ చిత్రం వరల్డ్ వైడ్ 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు చిత్రాలతో పోటీగా సింగిల్ థియేటర్స్ తో సహా భారీ వసూళ్లు సాధించిన మలయాళ సినిమా ని మళ్ళీ తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ డబ్ చేసి రిలీజ్ చేయగా….తెలుగులో కూడా మంచి వసూళ్లు దక్కించుకుంది.తాజాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ అందుబాటులో ఉండనుంది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల సాహసం ఆధారంగా సినిమా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనం సృష్టించబోతోంది.

Related posts

థియేటర్ల లోకి‘ 4కె పతివ్రతలు’

ఇరాన్ నోట ‘భగవంత్ కేసరి’ మాట

నానికి అనుమతి నిరాకరణ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More