వాస్తు శాస్త్రం లో ఇంటి లోపలకు ఎంత ప్రాధాన్యత వుందో బయట కూడా అంతే ప్రాముఖ్యత ఉంది..వాస్తు శాస్త్ర రిత్యా నిర్మించుకున్న ఇంటికి అన్ని దిశలు ముఖ్యమే.. ఇంటి వాస్తు విషయంలో మనం ఎక్కువగా వినిపించే పదం వీధిపోటు.. మనఇంటి లో మనం వుండే దానికి వీధిపోటు ఏంటి..? అసలు ఇది మంచి చేస్తుందా..? చెడు చేస్తుందా..? ఇంతకీ వీధిపోటు అంటే ఏంటి..? బయట నుంచి ఒక వీధి మార్గం మనం ఉంటున్న ఇంటిని గానీ ఇంటిప్రహారీ గోడను కానీ తాకి ఉంటే దానిని వీధి పోటు అంటారు.. కొందరు వీధిశూల అని కూడా పిలుస్తుంటారు..ఆ వీధి మన ఇంటి దగ్గర నిలిచి పోయినా మలుపు గా ముందుకు వెళ్లినా వీధిపోటు కిందే లెక్క..
ఒక విధంగా చెప్పాలంటే ఆ రోడ్ పై వెళ్లే వారి దృష్టి మన ఇంటి పై పడటమే వీధి పోటు.. కొన్ని వీధిపోట్లు మంచిగాను మరికొన్ని చెడు చేసేవిగాను ఉంటాయి.. కొన్ని భవంతులను ఇళ్లను గమనిస్తే అవి అమ్మకానికి పెట్టినా అద్దెకు పెట్టినా సంవత్సరాల తరబడి అలానే ఉంటాయి.. ఒకవేళ ఎవరైనా కొనుక్కున్న అద్దెకు దిగినా వెంటనే అమ్ముకువెళ్లిపోవడమో.. లేక ఖాళీ చేయడమో జరుగుతుంటాయి.. వీధిపోటు ఆ ఇంటికి చెడు చేస్తే ఫలితాలు అలానే ఉంటాయి.. అయితే ఏది మంచి.. ఏది చెడు అని తెలుసుకోవడం ఎలా..?తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం. మంచిని కలుగజేస్తాయి..తూర్పు ఈశాన్యం వీధి పోటు శుభ ఫలితాలను ఇస్తుంది.
మనశ్శాంతి, నిరంతర ధన వృద్ది, విదేశాలకు వెళ్లే అవకాశాలు రావడం , ఆకస్మిక రాజయోగం, ఉన్నత పదవులు,సంతానవృద్ధి వంటి శుభాలను కలుగజేస్తుంది..అలాగే ఉత్తర ఈశాన్యం వీధి పోటు ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యాలు కలిగించడమే కాకుండా ఉన్నత విద్య యోగం, విలాసవంతమైన జీవితం ఇస్తూ స్త్రీలకు రాజకీయ, వ్యాపార ఉద్యోగ రంగాలలో మంచి అవకాశాలను కలిగిస్తుంది..దక్షిణ ఆగ్నేయ వీధి పోటు అయితే జనాకర్షణ, ధర్మ చింతన, నిస్తూ ఇందులో నివసించే వారికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేస్తుంది..ఇక పడమర వాయువ్య
అష్టైశ్వర్యాలు ,భోగభాగ్యాలు , సుఖ సంతోషాలు కీర్తి ప్రతిష్టలను సంవృద్ధి గా అందిస్తుంది.. పైవన్నీ శుభాలను కలుగ జేస్తే చెడు చేసే వీధి పోట్లు కూడా కొన్నున్నాయి అవి ఏంటంటే తూర్పు ఆగ్నేయం, దక్షిణ నైరుతి , పడమర నైరుతి, ఉత్తర వాయువ్యం తూర్పు ఆగ్నేయం నష్టం కలిగించే వీధి పోటు ఎందుకంటే ఈ వీధి పోటు ఉన్న ఇంట్లో ఉంటే విపరీతమైన ఇబ్బందులు పడే అవకాశం వుంది.. విపరీతమైన ఖర్చులు, అప్పుల పాలవడం రావాల్సిన డబ్బులు రాకపోవడం, వివాదాలు, జైలు పాలవడం వంటి అతితీవ్ర కష్టాలకు లోనయ్యే అవకాశం కల్పిస్తుంది..
ఇక దక్షిణ నైరుతి విషయానికి వస్తే.. దక్షిణ నైరుతి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతుంది. కుటుంబీకులకు ఆరోగ్య సమస్యలు తీవ్రమై వాటికోసం అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది.. అంతే కాకుండా మానసిక అశాంతి, అభద్రతా భావం, ఆకస్మిక ధన నష్టాన్ని ఈ వీధిపోటు కలిగిస్తుంది కనుక ఇలాంటి ఇళ్లు ఎంత తక్కువకు వచ్చినా తీసుకోకపోవడమే బెటర్.. ఇలాంటి నష్టాలు కలిగించే మరో వీధిపోటు పడమర నైరుతి దీనివల్ల కూడా అనేక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా వుంది.. ముఖ్యంగా ఇంటి పెద్ద పై ఆ దుష్ప్రభావం ఎక్కువ ఉంటుంది.హెల్త్ దెబ్బతినడంతో పాటు ఆర్థిక పతనం, మానసిక ఒత్తిడి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య గొడవలకు కూడా ఈ వీధిపోటు అవకాశం కల్పిస్తుంది.. చెడు కల్గించే ఆఖరి వీధిపోటు ఉత్తర వాయువ్యం. ఇది ఆర్ధిక పతనానికి తీసుకు వెళ్లడమే కాకుండా సంతానాన్ని చెడు వైపు మళ్ళిస్తుంది.. ఊహించని వ వ్యాపార నష్టాలు, పెట్టుబడులు పెట్టి మోసపోవడం. అప్పులపాలవడం ఇలా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఒక్కో సారి మంచివి అనుకున్న వీధిపోట్లు చెడు ఫలితాలను చెడ్డవి అనుకున్న వీధిపోట్లు మంచి ఫలితాలను ఇస్తుంటాయి .
అందుకు గల కారణం శల్య వాస్తు,ఇంటి యొక్క వాస్తు నిర్మాణం ,విదిక్కులు మొదలగు భౌగోళిక పరిస్థితులు మరియు వీధిపోటు కలిగించే తీవ్రత పై ఫలితాలు ఆధారపడి ఉంటాయి.
కాబట్టి నిపుణులైన వాస్తు పండితుల చేత నిర్ధారించుకోవాల్సివుంటుంది