కాపు ఉద్యమ నేతగా ఆరు నెలలు యాక్టివ్ గా మరో ఆరు నెలలు అలకలో ఉండే ముద్రగడ అనేక ఊగిసలాటలో నడుమ వైసిపి నాయకుడిగా మారారు కాపు జాతికి కారణజన్ముడుగా అవ్వాలని పరితపించిన ఉద్యమ నాయకుడు ఉత్తినాయకుడిగా ఉండలేక రాజకీయ పార్టీ ఆసరా కావాలనుకుని అనేక నాటకీయ పరిణామాల నడుమ అధికార పార్టీలోకి అడుగు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి నేత లేడని కీర్తిస్తూ పార్టీలోకి వచ్చి సిన్సియర్ గా తన కర్తవ్యాన్ని ప్రచారాన్ని ప్రారంభిస్తే బాగానే ఉండేది.. కానీ తనకు అచ్చి వచ్చిన మాటలను దాచి పెట్టిన మూటల నుంచి తీసి ప్రగల్బాలు మొదలుపెట్టేసారు అయితే ముద్రగడ బుల్లెట్ లా దూసుకుపోయి 2024 కులాల సమగ్ర సర్వేలో పేర్కొన్న 5207091మంది కాపులు, ఉత్తరాంధ్ర కాపులు 1518,044 మంది ఉత్తరాంధ్ర కాపుల ఓట్లు గంప గుత్తగా తమకే పడిపోతాయని భావిస్తే అది కాస్త మిస్ఫైర్ అయి అబాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది.
పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలన్న భారీ టార్గెట్ తో ముద్రగడను అధిష్టానం ఆదేశించిందే తడువుగా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడటమే కాకుండా ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభమే కాదని పవన్ కళ్యాణ్ ని గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని శపధాలు చేసేసారు ఈ మాజీ మంత్రి గారు.. అసలు అక్కడే అసలు చిక్కంతా వచ్చిపడింది. ముద్రగడ శపథం తమ కులపోళ్ల సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళకే నచ్చలేదు. ఇంకేముంది ముద్రగడ కుమార్తె క్రాంతి ఓ వీడియో రిలీజ్ చేసి పవన్ కళ్యాణ్ ని ఎవరు అడ్డొచ్చిన గెలిపించుకుంటామని తండ్రికి గట్టిగా కౌంటర్ ఇచ్చి పడేశారు. ఇక్కడే వైసిపి నేతలకు అసలైన తత్వం భోధపడింది సొంతింటి వాళ్లే నమ్మనప్పుడు కులపోళ్ళు, కులనేతలు ఇతర ఓటర్లు విశ్వసిస్తారా..? అన్న డౌటు గట్టిగానే వచ్చింది ప్లస్ అవుతుందన్న ఆ నేత రాక పూర్తిస్థాయిలో మైనస్ అయి భారీగా ఓట్లకు గండి పెట్టబోతుందని గుసగుసలాడేస్తున్నారు.. ఇంతవరకు బాగానే ఉంది కూతురేదో మాట్లాడితే మాట్లాడిందని అంతటితో ఊరుకోకుండా ఆ కూతురు నా ప్రాపర్టీ కాదని వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ అని పొంతనలేని పదాలతో మరింత దిగజారిపోయే వ్యాఖ్యలు చేసేసారు పిఠాపురంలో పవన్ ఓటమికి సరైన యోధుడు దొరికాడు అనుకున్న వైసిపి నాయకులు మిస్పైర్ ముద్రగడని చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఫలితాలు తర్వాత మరొక రెడ్డి పద్మనాభ రెడ్డి రూపంలో రాబోతున్నాడని వాళ్ల మీద వాళ్లే సెటైర్లు వేసుకుంటున్నారు