మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్.-హీరోయిన్ కృతి శెట్టి

మనమే స్ట్రాంగ్ ఎమోషన్ కనెక్ట్ వున్న ఎంటర్ టైనింగ్ ఫిల్మ్. ఇందులో వండర్ ఫుల్ కిడ్, పేరెంట్ ఎమోషన్ వుంది. అది గ్లోబల్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా మా ముగ్గురి క్యారెక్టర్స్ చుట్టూ వుంటుంది. అందుకే మనమే అనే పేరు పెట్టాం. ఇది పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రతి సీన్ లో ఎంటర్ టైన్మెంట్ వుంటుందని హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ , రామ్‌సే స్టూడియోస్‌ బ్యానర్లపై నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతి శెట్టి చిత్ర విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు. ఇప్పటివరకూ క్యూట్, సాఫ్ట్, బబ్లీ క్యారెక్టర్స్ చేశాను. కానీ ఈ క్యారెక్టర్ ఇంత వరకూ నేను చేసిన క్యారెక్టర్స్ కి డిఫరెంట్ గా వుంటుంది. నాకు చాలా కొత్తగా వుంటుంది. షూటింగ్ సమయంలో డైరెక్టర్ శ్రీరామ్ గారిని ఇంత స్ట్రిక్ట్ గా వుంటుందా?! అని చాలా సార్లు అడిగాను. ఆయన అంత స్ట్రిక్ట్ గా కావాలని చెప్పారు. ఆయన విజన్ ని ఫాలో అయ్యాను. పర్శనల్ గా నాకు పెద్ద కోపం రాదు. పెద్దగా అరవను. చాలా కామ్ గా వుంటాను. సుభద్ర క్యారెక్టర్ నాకు పూర్తిగా కొత్త. శర్వానంద్ గారు వన్ అఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్. నిన్న సినిమా చూశాను. ఆయన ప్రతి సీన్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆయన ఎక్స్ పీరియన్స్ కనిపించింది. ఇందులో నాకు ఓ ఫేవరట్ సీన్ వుంది. ఆ సీన్ కోసం చాలా వెయిట్ చేశాను. ఎలా చేయాలో అని చాలా అలోచించాను. కానీ శర్వానంద్ గారు చాలా కాజ్యువల్ గా వచ్చి ఆ సీన్ ని ఒక్క నిమిషంలో అద్భుతంగా ఫినిష్ చేశారు. నేను స్టన్ అయిపోయాను. చిత్రం చాలా భాగం లండన్ లో షూట్ చేశాం. లండన్ వెదర్ చాలా అన్ ప్రెడిక్టిబుల్ గా వుంటుంది. మేము షూట్ చేసిన హౌస్ లో చాలా విండోస్ వుంటాయి. ఒక ఫ్రేం సెట్ చేశాక లైట్ మారిపోతుంది. సడన్ గా వర్షం పడుతుంది. మళ్ళీ లైట్ వచ్చేవరకూ వెయిట్ చేయాలి. ఇది చాలా డిఫికల్ట్ ప్రాసస్. సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతిలో వుండదు. మన చేతిలో లేని విషయాలు గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. నాకు ప్రిన్సెస్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం. బాహుబలి లో అనుష్క గారి లాంటి క్యారెక్టర్స్. అలాగే యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ వున్న రోల్స్ చేయాలని వుంది. మూడు తమిళ్ ఫిలిమ్స్ అలాగే టోవినో థామస్ తో ఒక మలయాళం ఫిల్మ్ చేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More