ఐదేళ్ల లోపు పిల్లలకు శని ప్రభావం ఉండదా..?

ప్రతీ మనిషి తన జీవిత ప్రస్థానంలో శని దేవుడికి సంబంధించిన ప్రభావ తాకిడికి ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే.. నిజానికి శనిదేవుడు కేవలం చెడు ని మాత్రమే ఇస్తాడు అంటే పొరపాటే.. అంతకు మించిన శుభాన్ని కూడా కలుగజేస్తాడు.. ముఖ్యంగా ఒక అనుభవ పాఠాన్ని నేర్పిస్తాడు. శని మహదశ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఇలా ఎన్నో దశలలో ప్రభావం చూపించే శనీశ్వరుడు ఐదేళ్ళ లోపు పిల్లలపై తన ప్రభావాన్ని చూపించడా…? మరి పుట్టిన జన్మరాశి అనుసరించి ఆ వయసు లో జాతక ప్రభావం బట్టి శనికి సంభవించిన ది ఏదైనా ఉంటే అది పిల్లలకి వర్తించదా…? ఎందుకలా..?అందరికి పగలు రాత్రి అన్న తేడా లేకుండా చుక్కలు చూపించిన శనిదేవునకే చుక్కలు చూపించి పిల్లలకు శనిదోషం వర్తించకుండా చేసిన బాలజ్ఞాని పిప్పలాదుడు దశోపనిషత్తును లలో ఒకటైన ప్రశ్నోపనిషత్ ని రచించిన తత్వవేత్త బాలలకు ఐదేండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు.. అసలు ఇది ఎలా సాధ్యమైంది. అన్న కథనాన్ని పరిశీలిస్తే దేవతలకాలంలో వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా భాదిస్తుండేవాడు.. ఆ రాక్షసుని బాధలు తొలగిపోవాలంటే ఒక ఆయుధం కావాలని అది ఒక విభిన్నంగా ఉండాలని తలచిన దేవతలు దధీచీ మహర్షీ వద్దకు వెళ్లి వృత్రాసురుని బాధలు చెప్పుకుని తమ ఎముకలతో చేసిన ఆయుధాల వలన మాత్రమే ఆ అసురుడికి మరణం ఉందని చెప్తే తన దివ్య దృష్టితో భవిష్యత్ ని దర్శించిన మహర్షి పుట్టిన ప్రతి ప్రాణీ దేహం వదలక తప్పదు. తప్పదు. ప్రాణం లేని శరీరము క్రిమికీటకాలకు ఆహారమవుతుంది. దానికన్నా ఈ రకంగా దేవ కార్యార్థం ఉపయోగించబడటం శ్రేయస్కరం అని ఆలోచించి సరే అన్నాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చుని ప్రాణత్యాగం చేశారు. అతని ఎముకలతో ముఖ్యంగా వెన్నెము క భాగాలతో దేవతా శిల్పి విశ్వకర్మ వజ్రాయుధం తయారుచేశారు. విష్ణుమూర్తి తన శక్తిని అందులో ప్రవేశపెట్టి శక్తి వంతం చెయ్యడం తో వృత్తాసుర సంహారం జరిగింది. అయితే దధీచి భార్య లోపాముద్ర. ఈమెనే ‘సువర్చ’ అని కూడా అంటారు. తన భర్తను దేవతలు అన్యాయంగా బలి తీసుకున్నారని నిందించి, సహగమనానికి ఏర్పాటు చేసుకుంది. అయితే అప్పుడు అశరీరవాణి, ‘అమ్మా! నువ్వు గర్భవతివి. ఇలాంటి తరుణంలో ప్రాణత్యాగం అశుభం అంటే ఆమె తన గర్భ విచ్ఛిత్తి చేసుకుని లోపల ఉన్న శిశువును తీసి, ఆశ్రమ ప్రాంగణంలోని రావిచెట్టు క్రింద పడుకోబెట్టి, సహగమనం చేసింది. ఆ బాలుడు పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తు రావి చెట్టుకు ఉన్న తొర్రభాగంలో ఉన్న బాలుడ్ని చూసి ఎవరని ప్రశ్నిస్తే నేను అదే తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఆ బాలుడు చెప్పడం తో నారదుడు తన దివ్య దృష్టి తో చూసి ఆశ్చర్యం తో నీవు మహా దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్తికల తో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు. అని చెప్తూ శని దేవుని మహదశ వలన మీ తండ్రికి నీకు ఈ గతి సంప్రాప్తించిందని చెప్పిన తరువాత అక్కడికి చేరిన దేవతలు ఆ బాలునికి ‘పిప్పలాదుడు’ అని నామకరణం చేసి దీక్షను ఇచ్చి వారు నిష్క్రమించారు. వారు వెళ్లిన తరువాత నారదుడు చెప్పిన దీక్షానుసారం కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడ్ని ప్రసన్నం చేసుకున్నాడు. తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే దానిని దహించి వేసే శక్తిని కోరుకొని అన్నింటినీ దహించడం ప్రారంభించాడు. విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనికి కూడా ఆ ప్రభావం వ్యాపించింది.. శని దేవుడ్ని రక్షించడంలో దేవతలందరూ కూడా విఫలమయ్యారు.సూర్యుడు కూడా తన కళ్ల ముందు దహించుకు పోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడి ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టమని విన్నవించాడు కానీ పిప్పలాదుడు అందుకు అంగీకరించకపోతే ఒకటి కాదు నీకు రెండు వరాలు ఇస్తాను అని అనడం తో పిప్పాలాదుడు సంతోషించి రెండు వరాలను కోరుకున్నాడు. అందులో ఒకటి ఏంటంటే పుట్టినప్పటి నుండి ఐదేళ్ల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు అని మరొక వరం ఏంటంటేమాతామహులు లేని నాకు ఈ రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కానున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు. అని రెండు వరాలు లోక హితం కోసం కోరుకున్నాడు దానికి బ్రహ్మాదేవుడు ‘తథాస్తు’ అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో మండుతున్న శనిని విడిపించి తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడుఅందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే ‘పిప్పలాద మహర్షి’ నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడుశనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని “శనిః చరతి య: శనైశ్చరః” అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.శనివారం నాడు ఒకపళ్ళెంలో చిన్న ఇనప దీపం (స్టీల్)కుందిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి,బెల్లం ముక్క పెట్టి ఈ శ్లోకం వీలైనంత ఎక్కువ సార్లు జపించడం వల్ల శని భాధ నివారణ కలుగుతుంది. ఈ స్టీల్ దీపం సహజంగా నిత్య పూజలకు వాడకూడదు శనీశ్వరుడి అనుగ్రహము కోసం శనివారం రోజు మటుకు విడిగా ఒక పళ్ళెంలో ఇలా చేస్తూ ఉంటే మీకు శనిదేవుని అనుగ్రహము లభిస్తుంది.ఎలినాటి శని దశ జరుగుతున్న వారు కూడా ఇలా స్టీల్(ఇనుప) కుందిలో దీపం వెలిగించి, పిప్పలాదుడు స్త్రోత్రం, హనుమాన్ చాలిసా చదివితే.. ఆ ప్రభావం తగ్గుతుంది.. శరీరం అలసిపోయే లాగ వాకింగ్ చేసిన శని శాంతించి ఆటంకాలు తొలగిపోతుంది.పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం……నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతేనమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచనమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతేప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||ఓం శం శనైశ్చరాయ నమః

Related posts

టికెట్ ధరకు విలువైన వినోదాన్ని గ్యారెంటీగా ఇస్తుందంటున్న దర్శకుడు

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More