ఆ తండ్రికి ఎంత కష్టం…

కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అయింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి
విభాగంలో చేర్పించారు. నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉన్న ఎన్ఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ బయలుదేరారు.
నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా.. సమయానికి సిబ్బంది లేకపోవడంతో శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ను భుజాన వేసుకొని ఆమె వెంట వెళ్లారు.
ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు అయితే పోస్ట్ డెలివరీ తరువాత తల్లీ బెడ్ దిగి రాకూడదు.. అప్పుడే పుట్టిన బిడ్డని రహదారి మీద ఉన్న గోతులు కుదుపులు కారణంగా వీల్ చైర్. వీల్ బెడ్ ల SNCU.NICU వార్డుల కు తీసుకొని వెళ్లకూడదని కేవలం ఎవరో ఒకరు నర్సింగ్ సిబ్బంది చేతికిచ్చి వారి బంధువుల సహాయంతో జాగ్రత్తగా పంపిస్తారని అక్కడి సిబ్బంది చెపుతున్నారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి దృశ్య అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ ని వీల్ చైర్ లో గాని వీల్ బెడ్ మీద గాని పంపించాలి దానిని .. కానీ ఆ బిడ్డ తండ్రి తన బిడ్డ మీద ప్రేమే కావచ్చు అత్య అవసరమే కావచ్చు అక్కడ సిబ్బంది కొరత అయినా కావచ్చు ఎమైనా కావచ్చు ఆక్సిజన్ సిలిండర్ ను అతనే స్వయంగా తీసుకొని వెళ్ళారు… కేజీహెచ్ లాంటి అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి దృశ్యాలుగా కోకొల్లలుగా కనిపిస్తాయి..
గైనిక్.SNCU.NICU వంటి పిల్లల వార్డు వద్ద చూస్తే రోజు కనపడతాయి… ఒక విధంగా చెప్పాలంటే ఇదే వీల్ చైర్లు వీల్ బెడ్స్ మీద మందులు సర్జికల్ ఐటమ్స్ తీసుకుని వెళ్తారు. కానీ రోగులు ను వారి బంధువులు మోసుకొని లేదా వారే స్వయంగా కుంటు కుంటూనే వెళుతూ ఉంటారు… ఆసుపత్రికి నిత్యం వెళ్లే వారికి ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ దృశ్యాన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ఇది వైరల్ అయి వార్తల్లోకి వచ్చింది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More