చిన్న దేశాల సాటిలైట్ల ప్రయోగానికి భారత్ వేదికగా మారింది.అమెరికా వంటి దేశాలలో ఈ ప్రయోగాలకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో చాలా దేశాలు భారత్ వైపే ముగ్గు చూపుతున్నాయి.ఈ కార్యక్రమంలోనే కొన్ని దేశాలు తమ సాటిలైట్లను భారత్ నుంచి ప్రయోగిస్తున్నాయి.తక్కువ ఖర్చుతో ఇక్కడ వారి పని పూర్తి అవుతుండడంతో చాలా దేశాలు భారత్ నుంచి తమ దేశానికి సంబంధించిన వివిధ సాటిలైట్లను ప్రయోగాలకు వేదికగా మార్చుకున్నాయి.ఇందులో భాగంగాసింగపూర్ తమ దేశానికి సంబంధించి ఏడు సాటిలైట్లనుభారతరత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి ఆదివారం సింగపూర్‌కి చెందిన PSLV-C56 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయోగించనున్నారు. శనివారం ఉదయం 5 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాకెట్ పై భాగంలో 7 ఉపగ్రహాల్ని సెట్ చేశారు. 30న ఆదివారం ఉదయం 6.30కి ఈ రాకెట్ రివ్వున దూసుకుపోతుంది. ఆ తర్వాత ఓ గంట లోపే శాటిలైట్లన్నీ భూ కక్ష్యా మార్గంలోకి జారుకుంటాయి. ఆ తర్వాత వాటి సోలార్ ఫలకాలు విచ్చుకుంటాయి. నెక్ట్స్ అవి భూమి చుట్టూ తిరుగుతూ పనిచేయడం ప్రారంభిస్తాయి.ఇవన్నీ చిన్న నానో ఉపగ్రహాలు.ఇస్రో మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ను ఆకాశంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లూ చేశారు.కౌంట్ డౌన్ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్తలంతా రాకెట్ లోని 4 దశలలో ఫ్యూయల్‌ని నింపే పనిపై ఫోకస్ పెడతారు. అలాగే వాతావరణాన్ని గమనిస్తూ ఉంటారు. ప్రస్తుతం రెండు రోజులపాటూ ఏపీ, తెలంగాణపై పెద్ద మేఘాలు వచ్చే అవకాశం లేదు. అందువల్ల వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్, ఇతర కీలక శాస్త్రవేత్తలు షార్ చేరుకున్నారు.