ఈ చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది -హిరోయిన్ కావ్యథాపర్

విశ్వం చిత్రం లో ప్రతీదీ చాలెంజింగ్ గా అనిపించిందని హీరోయిన్ కావ్యథాపర్ అన్నారు శ్రీను వైట్ల దర్శకత్వం లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ సంయుక్తంగా వేణు దోనేపూడి, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన విశ్వం ఈనెల 11న థియేటర్ లో విడుదల కాబోతున్న సందర్భంగా కావ్యథాపర్ విలేకరుల సమావేశంలో అనేక విషయాలు పంచుకున్నారు.


ఈ చిత్రం లో నా కేరెక్టరే భిన్నంగా డిజైన్ చేశారు. దర్శకడు శ్రీనువైట్ల గారు సన్నివేశపరంగా సీన్స్ చెప్పి నాచేత చేయించడం అనేది పెద్ద చాలెంజింగ్ అనిపించింది. ఆయన అన్ని విషయాల్లో ఫర్ ఫెక్ట్ గా వుంటారు. సిట్యువేషన్ పరంగా సన్నివేశాన్ని వివరించే విధానంలో కొత్తదనం చూపారు. నాది చాలా స్టయిలిష్ కేరెక్టర్. నేను కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ఇందులో చేశాను. మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని. కనుకనే కాస్ట్యూమ్స్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. నాకున్న ఐడియాతోనూ, కాస్ట్యూమ్స్ డిజైనర్ ఐడియాకి తోడు శ్రీనువైట్ల గారి ఐడియాతో కాస్ట్యూమ్స్ ధరించాను.
ముందుగా చిత్రాలయ బేనర్ సినిమా చేసింది. ఆ తర్వాత పీపుల్స్ మీడియా కలవడంతో రేంజ్ పెరిగింది. నిర్మాణవిలువలు చాలా హైలో వున్నాయి. వారు చాలా కేర్ తీసుకున్నారు. హిమాచల్, మనాలి వంటి చోట్ల మంచు ప్రాంతాల్లో వర్క్ చేయడం చాలా కష్టం. అంత కష్టమైన ప్రాంతాల్లో చాలా ప్రికాషన్స్ తీసుకునేలా వారు సహకరించారు. చాలా మంది టీమ్ ను అక్కడి వచ్చేలా చేసి సినిమా బాగా వచ్చేలా చేశారు. రిచ్ నెస్ రేపు సినిమాలో కనిపిస్తుంది.
నేను చాలా ఫాస్ట్ గా జోవియల్ గా వుంటాను. గోపీచంద్ గారు చాలా కామ్ గా వుంటారు. సెట్లో చాలా సైలెంట్. తన పనేదో తాను చేసుకుంటారు. అందుకు భిన్నమైన కారెక్టర్ నాది. అందుకే ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. మాడ్యులేషన్ పరంగా నైతే, సిస్టమాటిక్ విషయాలన్నీ గ్రహించాను. ఒకరకంగా తెలుగుకూడా నేర్చుకున్నా… శ్రీనువైట్ల గారి డెడికేషన్ కు హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమాలో చాలా పాత్రలున్నాయి. అందరినీ మోటివేట్ చేయడమంటే మాటలు కాదు. ప్రతివారి నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే శ్రీనుగారి వల్లే నేను బాగా నటించగలిగాను. అంతా నాచురల్ గా వచ్చేలా చేశారు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా నేచురల్ గా వుంటుంది. అంతమంది కమేడియన్స్ ట్రెయిన్ లో వున్నా వారంతా సన్నివేశరంగా వుంటారు. గతంలో ఆయన చేసిన సినిమాతో ట్రెయిన్ ఎపిసోడ్ పోల్చలేం. గతంకంటే విశ్వం చాలా కొత్తగా వుంటుందని చెప్పగలను. ప్రత్యేకత ఏమంటే అందరి పాత్రలను దర్శకుడు ఎలా యాక్ట్ చేయాలో చేసి చూపించేవారు. అలా నాకు కూడా నా పాత్రపరంగా చెబుతూ నా శైలిని మలుచుకునే చేశారు. నా పాత్ర కూడా కామెడీ చేస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్లు నరేష్ గారు, ప్రగతి గారు. డిఫరెంట్ గా మా ఫ్యామిలీ సినిమాలో కనిపిస్తుంది. నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో గ్లామర్ పాత్ర చేశాను. నటిగా అన్ని పాత్రలు చేయాలనుంది. ఎటువంటి టఫ్ పాత్రనైనా చేస్తానే ధైర్యం కూడా వచ్చేసింది. సైకో కిల్లర్ తరహా పాత్రలు చేయడం టఫ్. కానీ అవి కూడా చేస్తాను. నటిగా పాత్రకు న్యాయం చేయాలి అనే నమ్ముతాను.

సక్సెస్, ఫెయిల్యూర్ లను ప్రస్తావిస్తూ
అది నా చేతుల్లో లేదు. నావరకు నేను పాత్రకు న్యాయం చేస్తాను. ఇచ్చిన పాత్రకు కష్టపడి పనిచేయడమే తెలుసు. మిగిలింది దేవుడిపై భారం వేస్తా. నేను చేసిన పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి ప్రతివారికీ వస్తుంటాయి. ఔట్ డోర్ షూట్ లో చాలా చాలెంజింగ్ అనిపించింది. టెంపరేచర్ ఎక్కువగా వున్నప్పుడు, హిమాచల్ వంటి చోట్ల మైనస్ డిగ్రీలలో వాతావరణ వున్నప్పుడు యాక్ట్ చేయడం అనేది ఫిజికల్ చాలెంజ్. అవన్నీ చూసుకుని దేనికైనా రెడీ అన్నట్లుగా చేయగలిగాను. నాతోపాటు సాంకేతిక సిబ్బంది కెమెరాలు మోసుకుని రావడం, ఇతర సిబ్బంది కొండలు ఎక్కడం వంటివన్నీ చాలా చాలెంజింగ్ అంశాలే అని ఆమె అన్నారు..

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More