ఏపీ లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి బిజెపి, టిడిపి, జనసేన కూటమికి మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన మద్దతు పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.జనసేనకు పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వదమే కాకుండా కూటమి గెలవాలని చెప్పిన అభిప్రాయాన్ని కొంతమంది తప్పు పడుతూ ట్రోల్ మొదలు పెట్టారుఅలాగే అనకాపల్లి బిజెపి ఎంపీ అభ్యర్థి రమేష్, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు లకు నేరుగా తన మద్దతు తెలియజేస్తూ విడుదల చేయడం పై వైకాపా నాయకులు కార్యకర్తలు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు గతంలో జరిగిన సంఘటన లన్ని తవ్వితీస్తూ ఎత్తి పొడుస్తున్నారు.వీడియోల ద్వారా మద్దతు తెలియజేయడం కాకుండా నేరుగా రంగంలోకి దిగి ఆ కూటమికి ప్రచారం చేస్తే బాగుండేదని కాపు ఓట్లను టార్గెట్ చేస్తూ చిరంజీవిని రంగంలోకి దించారని వైకాపా ఆరోపిస్తుంది.ఏదేమైనప్పటికీ చిరంజీవి మద్దతు ప్రకటించిన సరే ప్రకటించకపోయిన సరే కూటమి అపజయం పాలు కాక తప్పదని వైకాపా నేతలు ముందస్తు జోస్యం చెప్పేస్తున్నారు..