అటు ఎన్టీఆర్ – ఇటు అక్షయ్..

బాహుబలి ముందు తర్వాత అన్నట్టుగా ఇండియన్ సినిమా మారిపోయింది.మొదట ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా నే అనుకునేవారు. రాజమౌళి బాహుబలి తో బాలీవుడ్ ను డామినేట్ చేసి ఇండియాలో ప్రాంతీయ చిత్రాల సరిహద్దులను చెరిపి పాన్ ఇండియన్ సినిమాలను సృష్టించిన ఘనతను చేజెక్కించుకున్నారు.. గతంలో అయితే బాలీవుడ్లో అవకాశం వచ్చినా చేయడానికి ప్రాంతీయ చిత్రాల నటులు సిద్ధంగా ఉండేవాళ్ళు.కానీ బాలీవుడ్ కి చెందిన వాళ్లు ప్రాంతీయ చిత్రాలలో నటించేందుకు విముఖత చూపించేవారు.కానీ ప్రస్తుతం రోజులు మారాయి.బాలీవుడ్ కి చెందిన బడా స్టార్లు ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ లలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.ముఖ్యంగా తెలుగు, తమిళ్ చిత్రాలలో అవకాశాలు వస్తే చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.అలాగే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ దక్షిణాది చిత్రాలలో తాము ఒక భాగం అయ్యారు.హిందీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వార్ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న హృతిక్ రోషన్ కు పూర్తిగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను అక్కడ మేకర్స్ రంగంలోకి దించారు.ప్రస్తుతం ఈ షూటింగ్ కొనసాగుతుంది.హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ మంచి నటులే కాక డాన్సర్స్ కూడా. వీరి కలయికలో చిత్రం అంటేనే ఊహించని విధంగా ఉంటుందని మేకర్స్ తెలియజేస్తున్నారు.వచ్చే ఏడాది ఈ మూవీ ని ఐదు భాషలలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో మోహన్ బాబు తన తనయుడు విష్ణుని పెట్టి భారీగా నిర్మిస్తున్న కన్నప్ప చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రంలో బాలీవుడ్ బడా స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. షూటింగ్లో జాయిన్ అయ్యారు కూడా. దక్షిణాది చిత్రాలలో అక్షయ్ నటించడం ఇదే మొదటిసారి.ఇక ఇదే సినిమాలో కన్నడ నుంచి శివ రాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ తో పాటు టాలీవుడ్ టాప్ స్టార్ ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషల చిత్రాలు నుంచి పాన్ ఇండియన్ స్థాయి సినిమాలు వస్తున్నాయి. ఇందులో ఎక్కువగా తెలుగు సినిమాలు ఉండటం విశేషం.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More