ఆగష్టు 23న చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్

చంద్రుడిని సమీపిస్తు ఒక్కో కక్ష్య మారుతూ వెళుతూ ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని ఆగష్టు 23న చందమామ పై క్షేమంగా ల్యాండ్ అయ్యేందుకు చంద్రయాన్-3 సిద్ధం అయింది.. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ఒకవేళ అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేయడం వలన ల్యాండింగ్ అత్యంత సేఫ్ గా జరిగే అవకాశం ఉందని దిశా భారత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలోఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.. చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమన్న భరోసా వ్యక్తం చేశారు.. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. విభిన్న పరిస్థితులలోచంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో మరోసారి అటువంటిది జరగకుండా ఇస్రో శాస్త్రవేత్తలు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయని చెప్పారు.చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు.నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.చంద్రయాన్-3 ల్యాండర్‌లో నాలుగు పేలోడ్‌లు ఉన్నాయన్నారు. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుందన్నారు. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయన్నారు. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More