రజనీకాంత్ జైలర్, మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.బోళాశంకర్ తీస్తున్న దర్శకుడు మెహర్ రమేష్ కు అంతకు ముందు వరుస ప్లాప్ లు ఉంటే జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు కూడా బీస్ట్ అనే డిజాస్టర్ ఖాతాలో ఉంది. ఈసారి ఇద్దరు దర్శకులు సూపర్ స్టార్, మెగాస్టార్లను పట్టుకుని భారీ సినిమాలను తీసి తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఒకరోజు ముందు వచ్చిన జైలర్ మూవీ పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయి అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే మరుసటి రోజు టాలీవుడ్ లో రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ మూవీ ఫాన్స్ ఆగ్రహాన్ని సైతం సొంతం చేసుకుంది. తమిళ డబ్బింగ్ జైలర్ మూవీ కంటే చిరంజీవి బోళాశంకర్ మూవీకి ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ థియేటర్లను కేటాయించారు. తెలుగులో కూడా ఊహించని విధంగా జైలర్ మూవీ మొదటి రోజు 12 కోట్లకు పైగా వసూలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ సినిమాను రిలీజ్ చేసిన దిల్ రాజు శాతం ప్రెస్ మీట్ పెట్టి జైలర్ ఆంధ్ర, తెలంగాణలో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందని, థియేటర్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. దీనికి విభిన్నంగా బోళాశంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. మెహర్ రమేష్ ని నమ్ముకుని చిరంజీవి భారీ ప్రాజెక్టును అతని చేతిలో పెట్టాడు. మెహర్ రమేష్ కేవలం అభిమానుల కోసమే ఈ సినిమా తీసినప్పటికి వారిని కూడా మెప్పించలేకపోగా సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చే విధంగా తీయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. వయసుకు తగ్గ క్యారెక్టర్ లు చేయకుండా చిరంజీవి వయసు మీద పడిన సరే ఇంకా మనవరాలు వయసున్న హీరోయిన్లతో లవ్ ట్రాక్ లు, రొమాంటిక్ సీన్లు ఏంటంటే ఆగ్రహం చెందుతున్నారు. రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్, బాలకృష్ణ వంటి హీరోలు వయసుకు తగిన పాత్రలు వేస్తూ వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో చిరంజీవి మూసపాత్రలను చేస్తూ రీమేక్ ల వెంట పడటం సరైంది కాదంటున్నారు. ఉదాహరణకు జైలర్ మూవీలో రజనీకాంత్ ఒక తండ్రిగా, తాతగా తన వయసుకు తగిన క్యారెక్టర్ చేసి అభిమానులను థియేటర్లకు రప్పించుకునేలా చేసారని అంటున్నారు. అయితే డైరెక్టర్ మెహర్ రమేష్ పరిస్థితి నేల విడిచి సాము చేయడం అన్న చందానా ఉందన్నది వాస్తవం. వాల్తేర్ వీరయ్య వంటి భారీ హిట్టు పడిన చిరంజీవికి వెంటనే మరో డిజాస్టర్ ఇచ్చాడనే అపవాదను మూట గట్టుకున్నాడు థియేటర్లకు ఇతర హీరోల అభిమానులు, సాధారణ ప్రేక్షకులు వస్తేనే కదా కలెక్షన్ల మీద ప్రభావం చూపేది. మొదటిరోజు థియేటర్ వద్ద హడావుడి కనిపించిన రెండో రోజు మాత్రం భోళా శంకర్ థియేటర్లకు జనం రావడం మానేశారు. అదే రజనీకాంత్ జైలర్ మూవీ కైతే అను వర్గాల ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. డైరెక్ట్ తెలుగు సినిమా కన్నా ఒక డబ్బింగ్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఇకనైనా సరే రీమేక్ లను నమ్ముకోకుండా స్ట్రైట్ మూవీ తీయాలని చాలామంది కోరుతున్నారు.మొత్తానికి బాక్సాఫీస్ రేసులో బోళా శంకర్ వెనుకబడిన మాట వాస్తవం. జైలర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ లను కొల్లగొడుతున్న మాట నిజం..