కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చే పార్టీలలో టీడీపీ అగ్రస్థానంలో నిలిచింది._ ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అంటూ జాతీయ మీడియా ప్రశంసలతో ఆర్టికల్ రాస్తుంటే తాజాగా అంతర్జాతీయ మీడియాలో కూడా చంద్రబాబును కింగ్ మేకర్ గా అభివర్ణిస్తూ అరికల్స్ వెలువడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో భారత రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను గురించి స్పెషల్ ఆర్టికల్ వెలువడింది… ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టెక్నాలజీకి రెండు దశాబ్దాల కిందటే పెద్ద పీట వేశారని, ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని, రాయితీలిస్తామని కంపెనీలను 20 ఏళ్ల కిందటే ఆహ్వానించారని ఆ ఆర్టికల్ లో రాశారు. చంద్రబాబు పాలనాపరమైన నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు దేశ విదేశాలలో లక్షలాది రూపాయల జీతం తీసుకుంటూ స్థిరపడ్డారని ఆ ఆర్టికల్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ద్వారా వేలాది కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలను సృష్టించడంలో చంద్రబాబు నాయుడుది కీలక పాత్ర అని ఆ ఆర్టికల్ వివరించింది. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో చంద్రబాబు నాయుడుది కీలకపాత్ర అని దాంట్లో రాశారు. ప్రస్తుతం మూడోసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని… చంద్రబాబు మద్దతు ఉపసంహరించుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ కూడా ఉందని రాసుకొచ్చారు. ఐదేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నుంచి, వైసీపీ నేతల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని ఆ ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు. ఈ కథనంపై టీడీపీ అభిమానులు ఆసక్తికర కామెంట్లు