నో వీఐపీ కాన్వాయ్…!

ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపవద్దని చంద్రబాబు నాయుడు సూచించారు.. కాన్వాయ్ వెళ్తున్న ప్రాంతంలో ట్రాఫిక్ ఆపొద్దని భద్రతా సిబ్బందికి సూచించారు.వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపేసే విధానాలకు స్వస్తి పలకాలనితక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సీఎస్ఓను ఆదేశించారు..చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి ఎయిర్ పోర్టుకు వెళ్లేలోపులోనే గుంటూరు ఎస్పీ, విజయవాడ సీపీలకు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చారుకాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలు నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు తెలిపారు..భవిష్యత్తులో కూడా సామాన్య ప్రజలకు, వాహన దారులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని భద్రతా చర్యలు పాటిస్తూనే సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తన రాకపోకలు ఉండేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.బారికేడ్లు, పరదాలు, రోడ్లు మూసివేత, షాపుల బంద్ వంటి సంస్కృతులకు ఇక స్వస్థి చెప్పాలని ఆదేశించారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More