టిడిపి లేకుండానే జనసేన, బిజెపి పోటీ..? ఆలోచనలో పడేసిన విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు..

బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు వచ్చే ఎన్నికలలో పొత్తుల అంశంపై ఒక క్లారిటీ ఇవ్వకపోగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి.. బిజెపి – జనసేన మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడం తో కేడర్ అయోమయంలో పడింది.. అయితే ఇదివరకు జనసేన – టిడిపి – బిజెపి కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాయనే ప్రచారం జరిగింది. కొందరు ఆ మూడు పార్టీల నేతలు కూడా విషయమే బహాటంగా కూడా స్పష్టం చేశారు. కానీ అధికారకంగా మాత్రం ఎవరూ కూడా ప్రకటించలేదు. అయితే టిడిపి తో కలిసి వెళ్లేందుకు మొదటి నుంచి బిజెపికి ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ ఒత్తిడితో కాస్త వెనక్కి తగ్గి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చినప్పటికి చూద్దాంలే చేద్దాంలే అన్నట్టే బీజేపీ వ్యవహరిస్తూ వస్తోంది ప్రస్తుతం టిడిపి, జనసేన అధినేతలు జనంలోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతుంటే బిజెపి మాత్రం ప్రెస్మీట్లు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని, ఈ రెండు పార్టీలు కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కుంటాయని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. పవన్ బీజేపీతో లేరని దుష్ప్రచారం చేశారని, రెండు పార్టీల పొత్తుపై ఇష్టానుసారంగా మాట్లాడేవారని, అయితే అందులో వాస్తవం లేదని అన్నారు. జనసేనతో బీజేపీ పొత్తు ఉందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే మీటింగ్‌కు పిలుపు ద్వారా అందరికీ కనువిప్పు కలిగిందన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. అయితే పొత్తులకు సంబంధించి ఆయన జనసేన విషయం తప్ప టిడిపి కోసం ఎక్కడ ప్రస్తావించలేదు. అంటే వచ్చే ఎన్నికలలో టిడిపిని కాదని జనసేన బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. టిడిపి ఈసారి కూడా ఒంటరిగా బరిలోకి సిద్ధమన్నట్టు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే టిడిపి – సేన పార్టీ అధినేతలు మొదటి నుంచి చెబుతున్నారు. విడివిడిగా పోటీ చేస్తే అది వైసిపికి లాభం చేకూరుతుందని, కలిసి పోటీ చేస్తే వైసిపిని అడ్డుకోవచ్చని పలు సందర్భాల్లో టిడిపి, జనసేన నేతలు స్పష్టం చేశారు. బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం వైసిపికి కనుకూలంగానే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన- బిజెపి కంటే టిడిపికే క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. వైసీపీకి టిడిపి మాత్రమే గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం. టిడిపి తో కూడా కలిసి వెళ్తే వైసీపీని అడ్డుకోవచ్చని కొందరు సీనియర్ జనసేన నేతలు చెబుతున్నారు. కానీ ఇందుకు విరుద్ధంగా బిజెపి నేతలు వ్యవహరిస్తున్నారు. వ్యాఖ్యలు చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైన వ్యాఖ్యలా ? బిజెపి అధిష్టానం ఆదేశానుసారం మాట్లాడారా అనేది తెలియాలి. ఈయన వ్యాఖ్యలపై అయితే జనసేన అధినేత ఇంకా స్పందించలేదు. టిడిపి కూడా అసలు ఏం జరుగుతుందనేది గమనిస్తూనే ఉంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More