‘అన్‌స్టాపబుల్ కి మరోసారి గెస్టుగా ఏపీ సీఎం

ప్రముఖ ఓటీటీ ఆహా లో సూపర్ హిట్ షో అన్‌స్టాపబుల్ నాల్గవ సీజన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరోసారి గెస్ట్ గా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి గా గతంలో ఈ షో ద్వారా తన అనుభవాలను పంచుకున్న చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో షో లో పాల్గొననున్నారు. హిందూపూర్ శాసన సభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ లోనే సీఎం కనిపించనున్నారు.

ఎపిసోడ్‌ షూట్‌ కోసం అన్‌స్టాపబుల్ సెట్స్ కి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి బాలకృష్ణ స్వాగతం పలికిన ఫొటోలు వైరల్‌గా మారాయి. తొలి ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలకృష్ణ మధ్య అద్భుతమైన సంభాషణల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబరు 25న ఆహా లో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో