మెకానిక్ రాకీ ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందంటున్న విశ్వక్ సేన్

సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. రెండోసారి సినిమా చూసే రేంజ్ లో సినిమా వుందని సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్ లా మారిపోతాయని హీరో విశ్వక్ సేన్ అంటున్నారు. తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 1.0 ను శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో విడుదల చేశారు..

యాక్షన్‌ ప్యాక్డ్ హ్యామరస్ గా వుంటుందని చెప్తున్న ట్రైలర్ లో రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్ ని టేకోవర్ చేసుకొని, లేడిస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లని ఫ్లర్ట్ చేస్తాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్ తో తలపడే క్యురియాసిటీ తో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్ డైలాగులు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.. మనోజ్ కటసాని స్టైలిష్ విజువల్స్, జేక్స్ బెజోయ్ ఎనర్జిటిక్ స్కోర్ ఎక్స్ పీరియన్స్ మరింతగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్న . ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నారు. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ , డైరెక్టర్ రవితేజ , నిర్మాత రామ్ తాళ్లూరి తదితరులు మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More