ఆ గ్రహాలలో ఏలియన్స్ ఉన్నారా.?

అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు నాసా పరీక్షించిన ట్రాన్స్ టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వీస్ సాటిలైట్ ద్వారా విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. గ్రహాలను పోలిన ఐదువేల ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. 2018 ఏప్రిల్ లో నాసా ప్రయోగించిన టీఎస్ఎస్ సాటిలైట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ ఉపగ్రహం కంటే ముందు బాహ్య గ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్ల టెలిస్కోప్ రెండువేల ఖగోళ వస్తువులను కనుగొన్నప్పటికి అవేవి గ్రహాలుగా నిర్ధారించబడలేదు. కానీ టెస్ కనిపెట్టిన ఒక గ్రహం పై ఏడాది కాలం, మన భూమిపై 16 గంటలకేముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిర్చల్ కొనిమోటో తెలిపారు. ఒక్క 2021 ఏడాదిలోనే 2400 ల గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ టెస్ గుర్తించిందని ఆమె వివరించారు. ఇప్పటివరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని మాత్రమే అంచనా వేశామని, కాని నిర్ధారణ చేయలేదని పేర్కొన్నారు. సౌర కుటుంబంలో ఇతర గ్రహాలు అన్వేషణ వాటిపై గ్రహాంతరవాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు నాసా ఈ టీఎస్ఎస్ సాటిలైట్ ను ప్రయోగించింది. టెస్ ఉపగ్రహం ఖగోళ వస్తువును కనిపెట్టి దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండటంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యమవుతుంది. టెస్ పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదరడంతో రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన టెస్ సాటిలైట్ సేవలు మరో మూడేళ్ల పాటు అంటే 2025 వరకు వినియోగించుకోవాలని నాసా పరిశోధకులు భావిస్తున్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More