బాహుబలి సినిమా మొత్తం ఇండియన్ సినీ ఇండస్ట్రీని చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని గట్టిగానే దెబ్బతీసింది. అక్కడ ఖాన్ ల త్రయానికి బ్రేక్ వేసింది. ఆ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ బాలీవుడ్ టాప్ హీరోలను మించిపోయాడు. నార్త్ బెల్ట్ లో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దీనికి తోడు బాయికాట్ బాలీవుడ్ ప్రచారం కూడా జోరందుకోవడంతో అక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని జనాల లేక థియేటర్లన్నీ ఖాళీగా మారిపోయాయి. పెట్టిన పెట్టుబడి రాక బాలీవుడ్ నిర్మాతలు చాలా నష్టాలు చూడాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం టాలీవుడ్ సినిమాలే అనే కోపాన్ని మనుసులో పెట్టుకున్న ఆ వర్గం దక్షిణాది మరి ముఖ్యంగా టాలీవుడ్ నుంచి విడుదలయ్యే సినిమాలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. తెలుగు సినిమాల పై వ్యతిరేక కథనాలు రాయడం తో పాటు సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం బాగా చేసారు. అయినప్పటికీ నిఖిల్ కార్తికేయ మూవీ, దుల్కర్ సల్మాన్ సీతారామం మూవీ, అడవి శేషు మేజర్, అల్లు అర్జున్ పుష్ప, ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ల ఆర్.ఆర్.ఆర్ మూవీలు బాలీవుడ్ లో ప్రభంజనాన్ని సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలను కొల్లగొట్టాయి. డైరెక్ట్ హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉండటం అదే సమయంలో తెలుగు సినిమాలు హిందీ బెల్ట్ ను కుమ్మేయడం బాలీవుడ్ మేకర్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేసింది.. దీనికి తోడు అక్కడ మీడియా అలాగే బాలీవుడ్ జనాలు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు సినిమాలపై విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. ఇదే క్రమంలో ప్రపంచప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ప్రభాస్ ఆది పురుష మూవీపై కూడా అక్కడి వారు తమ అసూయను ప్రదర్శిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత పటాన్ మూవీతో షారుక్ ఖాన్ బాలీవుడ్లో వెయ్యి కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. హమ్మయ్య బాలీవుడ్ కోలుకుంది అనుకునే లోపు మళ్లీ ప్రభాస్ తన ఆది పురుష్ సినిమాతో బాలీవుడ్ పై దండయాత్రకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్లో అయితే షారుక్ లేదా సల్మాన్, అమీర్ ఖాన్ తప్పితే ఎవరు సినిమా బాగా ఆడిన ఎవరి సినిమాకి బాగా కలెక్షన్ వచ్చినా కొందరు నార్త్ ఆడియన్స్ తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ కారణంగానే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, రణవీర్ కపూర్ లు ద్వితీయ శ్రేణి హీరోలగానే మిగిలిపోయారు. వారి సినిమాలకు అంతంతమాత్రంగానే కలెక్షన్లు వస్తుండేవి. ఖాన్ త్రయానికి వీళ్ళెవరు కూడా గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి సిరీస్ తో అమాంతంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ టాప్ స్టార్స్ ను అధిగ మించిపోయాడు. గత ఏడాది రిలీజ్ చేసిన ఆదిపురుష్ ట్రైలర్ ఎవరిని కూడా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలోఅదే అదనుగా భావించిన నార్త్ బెల్ట్ అంతా ప్రభాస్ లుక్ పై ఘోరంమైన ట్రోల్ చేశారు. వి ఎఫ్ ఎక్స్ పనుల కోసం మరికొంత సమయాన్ని కేటాయించడంతో ముందుగా ప్రకటించిన తేదీకి రిలీజ్ కాలేదు.వి.ఎఫ్.ఎక్స్ పనుల నిమిత్తం ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర దర్శకని నిర్మాతలు సిద్ధమయ్యారు. శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ పై కూడా నార్త్ ఆడియన్స్ విరుచుకుపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే పోస్టర్ చూసేందుకు బాగానే ఉంది. కానీ వేర్వేరు వంకలు పెడుతూ ప్రభాస్ అది పురుష్ సినిమాని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో తెలుగు హీరో హవాను చూసి తట్టుకోలేక పోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నాని దసరా సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా అక్కడ కూడా రిలీజయి పర్వాలేదనిపించింది. అయితే ఇప్పుడు అందరి టార్గెట్ ప్రభాస్ మాత్రమే. దర్శకుడితో పాటు మేకర్స్ కూడా నార్త్ ఇండియన్స్ అయినా కూడా ఆది పురుష్ సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుని ఆ సినిమా పైన అలాగే ప్రభాస్ పైన ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. అయితే అటు హీరోగాని దర్శక నిర్మాతలు కానీ అవేవి పట్టించుకోకుండా సినిమాకు సంబంధించిన తమ పనులు తాము చేసుకుని వెళ్ళిపోతున్నారు. జూన్ 16 న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటన చేశారు. అయితే పోస్టర్ కాకుండా మరొకసారి కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని అటు అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చిత్ర బృందం పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేసింది. బాలీవుడ్ లో ప్రభాస్ స్పీడ్ కు బ్రేక్ వేసేందుకు అక్కడి మేకర్స్ అలాగే మీడియా ఒక ఉద్యమంలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సాహో, రాధే శ్యాం చిత్రాలు పెద్దగా ఆడనప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం బాగా రాబట్టాయి. ఇప్పుడు ఆది పురుష్ వంతు వచ్చింది. ఈ మూవీని డ్యామేజ్ చేయడానికి కొంతమంది పనికట్టుకుని మరి ముందుకు వచ్చారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్-కె, అలాగే డైరెక్టర్ మారుతి సందీప్ వంగా, సిద్ధార్థ ఆనంద్ తో వరుసగా మూవీలు చేయనున్నాడు. ఆది పురుష్ తర్వాత ప్రభాస్ లైనప్ చాలా బాగుంది. ఆది పురుష్ మూవీ ఒకవేళ ఊహించని విధంగా సూపర్ హిట్ అయితే నార్త్ జనాలకు కంటి మీద కునుకు లేకుండా ఉంటుందనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.