కొత్త తరహా మోసం ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అప్రమత్తం గా లేకపోతే అంతే సంగతులు..

రోజురోజుకు అప్గ్రేడ్ అవుతున్న టెక్నాలజీ ని అందిపుచ్చుకుని సైబర్ కేటుగాళ్లు అంతే వేగంగా మోసాలకు తెగబడుతున్నారు.. సైబర్‌ దాడులు ఎక్కువచేస్తున్నారు . ఆన్‌లైన్‌లో డెబిట్‌, క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీ పిన్‌ నంబరు కొట్టేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేయటం.. సిమ్‌ స్వాప్‌ చేసి మన ఫోన్‌కు అందాల్సిన మెసేజ్‌లను మళ్లించి, డబ్బు లాగడం ఇలా ఒకటీ రెండూ కాదు.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు.. ఇలా రోజుకో రోజుకో కొత్తరకం మోసం తో వస్తున్న డిజిటల్ క్రిమినల్స్ మరో కొత్త మోసాన్ని తీసుకొచ్చారు అదే డిజిటల్‌ అరెస్ట్‌ ఇందులో సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్‌ చేసి తాము పోలీసులమనో, దర్యాప్తు సంస్థల అధికారులమనో నమ్మిస్తారు. బ్యాంకు ఖాతా, సిమ్‌ కార్డు, ఆధార్‌ కార్డు వంటివి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నట్లు బెదిరిస్తారు. విచారణ పూర్తయ్యేంతవరకూ అక్కడి నుంచి కదలటానికి వీల్లేదని కట్టడి చేస్తారు. డబ్బులు చెల్లిస్తే వదిలేస్తామని చెబుతారు. వారి ఖాతాలోకి డబ్బులు జమయ్యాక విడిచిపెడతారు. ఇలా మనిషిని ఎక్కడికీ వెళ్లనీయకుండా.. ఒకరకంగా అరెస్ట్‌ చేసినట్టుగా నిర్బంధించటమే ‘డిజిటల్‌ అరెస్ట్‌’. డిజిటల్‌ అరెస్ట్‌ కొత్త సైబర్‌ నేరం కావటం వల్ల ప్రజలు దీన్ని పోల్చుకోవటం కష్టమైపోతోంది. దర్యాప్తు అధికారులమని తొందర పెట్టటం వల్ల కంగారుపడి, ఏది ఎక్కడికి దారితీస్తోందనే భయంతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు.
నోయిడాకు చెందిన ఒక మహిళకు ఇలాగే ఒకరు ఫోన్‌ చేసి, తాను దర్యాప్తు అధికారినని చెప్పాడు. ‘మీ ఆధార్‌ కార్డుతో సిమ్‌ కొన్నారు. దాన్ని ముంబయిలో మనీ లాండరింగ్‌ కోసం వాడుకున్నారు’ అని బెదిరించాడు. దర్యాప్తు అనేసరికే ఆమె హడలిపోయింది. దీన్ని గుర్తించిన నేరగాడు మరింత రెచ్చిపోయి తదుపరి విచారణ కోసం కాల్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. అవతలి నుంచి మరో నేరగాడు తాను ముంబయి పోలీసు అధికారినని చెప్పి విచారణ ఆరంభించాడు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ నిరంతరాయంగా స్కైప్‌ కాల్‌ చేశాడు. అంతసేపూ ఆమెను అక్కడి నుంచి కదలనీయలేదు. అతడి ఖాతాలోకి రూ.11.11 లక్షలను ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాక గానీ కాల్‌ కట్‌ చేయలేదు. చివరికి తాను మోసపోయానని ఆ మహిళ గుర్తించి సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.
ఇలాగే అజ్ఞాత వ్యక్తులు ఫోన్‌ చేసి, తీయని మాటలతో మభ్యపెట్టో, నగ్న చిత్రాలతో బెదిరించో ఖాతాలు ఖాళీ చేయటమూ చూస్తున్నదే. సంస్థల కంప్యూటర్ల మీద దాడిచేసి, వాటిని పనిచేయకుండా నిలిపివేయడం.. డబ్బులు ఇస్తేనే విడుదల చేయటం ఇలాంటి తరహా మోసాలలో తాజాగా ‘డిజిటల్‌ అరెస్ట్‌’ వంటి కొత్త నేరాలూ వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి సైబర్ క్రైమ్ బారిన పడినట్లయితే అధైర్య పడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ గాని లేదా జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటి కోర్ వింగ్ గాని గోల్డెన్ అవర్ లో వచ్చిన లేదా 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు లేదా http//www.cybercrime.gov.in పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని పోలిసులు తెలియజేస్తున్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More