శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనం గా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని
టిటిడి కాల్‌సెంటర్ ద్వారా భక్తులకు అందించేందుకు 155257.కాల్ సెంటర్ నంబరును ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏర్పాట్లపై భక్తులు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఈ`మెయిల్ : helpdesk.ttd@tirumala. org ను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో రోజుకు దాదాపు 2 వేల ట్రిప్పుల ద్వారా దాదాపు 2 లక్షల మందికి రవాణా సౌకర్యం కల్పిస్తామని
తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు 24 గంటల పాటు ఉచిత బస్సుల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఇందులోభాగంగా సాదారణ రోజుల్లో 8 ప్రాంతాల్లో, గరుడ సేవనాడు 12 ప్రాంతాలలో క్రేన్లు, ఆటోమొబైల్ క్లినిక్ వాహనాలు ఏర్పాటు.
గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 8న గరుడసేవ రోజున విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు చేశామని టీటీడీ తెలిపింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తామన్నారు
గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గం తెరిచి ఉంచడం జరుగుతుందని భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయడమైందని పేర్కొన్నారు.
గరుడ వాహనాన్ని సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 11 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతారని బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలి. అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద రెండు వేల టూ వీలర్లు, వినాయక్‌నగర్ క్వార్టర్స్, నెహ్రూ మున్సిసల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్, దేవలోక్‌ల వద్ద ఉన్న గ్రౌండ్‌లలో 4 వీలర్లు, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లే ఆర్‌టిసి బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు అలాగే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 7 నుండి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు , పులిహోర, టమోటా బాత్, బిసిబెళా బాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు
చక్రస్నానం ఏర్పాట్లు
శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మహత్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి. సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామని
భద్రత కోసం గజ ఈతగాళ్లతోపాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అస్సాం మొదలైన 21 రాష్ట్రాల నుండి వచ్చే కళాబృందాలతో వాహనసేవల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశామని
2023లో 12 రాష్ట్రాల నుండి కళాబృందాలు పాల్గొనగా, 2024లో 21 రాష్ట్రాలకు చెందినమొత్తం 160 బృందాలు రానున్నాయని వివరించారు.