కన్ఫ్యూజ్ సర్వేలు.. పీక్స్ లో రాజకీయాలు..

దేశం మొత్తం జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల కంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీదే అందరి దృష్టి ఉంది..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు ఓ వైపు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరోవైపు సర్వేలు జనాలని, నేతలని కన్ఫ్యూజ్ లోకి నెట్టేస్తూ రాష్టం లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి లో నెట్టేస్తున్నాయి.. గత ఎన్నికల్లో 49.95శాతం ఓట్ల తో వైసీపీ అధికారం చేపట్టగా 79 సీట్లను కోల్పోయి 39.17 శాతం ఓట్లతో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన విషయం అందరికి తెలిసిందే.. అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందన్నది కూడా వాస్తవం.. అయితే ఇప్పుడు ప్రకటిస్తున్న సర్వేలు మాత్రం దీనికి భిన్నంగా 51.03 శాతం ఓట్లతో 25 పార్లమెంట్ సీట్ల కు గాను అధికార వైసీపీ 24 సీట్లను కైవసం చేసుకుంటుందని టైమ్స్ నౌ వెల్లడించింది.. ఇక్కడే కన్ఫ్యూజన్ అంతా మొదలైంది.. జరుగుతున్న చిన్నాచితకా ఎన్నికలన్నిటిలోను బొక్కబోర్లా పడ్డ (రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఉపఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది) అధికార పార్టీ కి వచ్చిన ఓట్ల ఆధారంగా చూస్తే పర్సెంటేజ్ విషయం తో భారీ వత్యాసం కనపడుతుంది.. అలాగే కొన్ని ఒపీనియన్ పోల్స్ లో కూడా గత ఎన్నికల్లో వచ్చిన పర్సంటేజ్ కంటే చాలా తక్కువే నమోదవుతుంది.. కానీ పెద్ద సంస్థలు ఇచ్చే సర్వేలు మాత్రం అందరిని అయోమయంలోకి తోసేస్తున్నాయి.. ఇదంతా అధికార పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుంటే.. అధికార పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..


రియల్ జనం నాడి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే ప్రభుత్వంపై మాత్రం ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది.
పెరిగిన నిత్యవసర ధరలు, కరెంట్ బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్ను మద్యం, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనంలో చాలా ఆగ్రహం ఉంది. ప్రజలకు వివిధ పథకాల రూపంలో వారి ఖాతాలలో డబ్బులు వేస్తున్నాం కదా వైసీపీకి కచ్చితంగా మెజార్టీ ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలయితే ధీమాగా ఉన్నారు. ఏకపక్షంగా జగన్ కి జై కొట్టిన క్రైస్తవులు కూడా ఇప్పుడల లేరని సమయం వచ్చినప్పుడు తమ ఓటుతో నచ్చిన పార్టీని గెలిపించుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారన్నది ఇన్సైడ్ టాక్..
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగడుతూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వైసీపీని ఇంటికి పంపించేయాలని మరోపక్క టిడిపి, జనసేన పార్టీలు కూడా గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీ నేతలు రాజకీయంగా కాకుండా ప్రత్యేక దూషణలకు దిగుతూ తమ పరువును తామే బజారుకు ఈడ్చుకుంటున్నారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా దూషణలు చేయడం మొదలు, దాడులు చేసుకునేంత వరకు కూడా పరిస్థితి మారిపోయింది. పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ అది ప్రభుత్వం ఆదేశాల మేరకే పని చేస్తుంది.
దీంతో విపక్ష పార్టీ నేతలు పోలీసు వ్యవస్థను ప్రతిపక్షాల నేతల మీదకు ఉసిగొలుపుతూ తమను అడ్డుకోడానికి చూస్తుందని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు.
టిడిపి, జనసేన, వైసిపిలు మాత్రం రాష్ట్రమంతా చుట్టేస్తూ ఎన్నికల హీట్ ను పెంచేస్తున్నాయి.
దసరా తర్వాత అసలైన పోరు సాగునుందనే తెలుస్తుంది. అప్పుడు పూర్తిస్థాయిలో అన్ని పార్టీలు గ్రామస్థాయి నుంచే ప్రచారాలు చేయనున్నాయి. ఏదిఏమైనా రాజకీయాలు, సర్వేలు. ఎలా వున్నా ఈసారి ఎన్నికల ఫలితాలు మాత్రం ఊహించని విధంగా వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More