కోలీవుడ్ సునీల్

ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలనే సామెత ఉంది. టాలీవుడ్ విలక్షణ నటుడు సునీల్ కు ఈ సామెతను ఇప్పుడు నిజం చేసేస్తున్నారు.
టాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ తర్వాత టాప్ కమెడియన్ గా మారి ఆ తర్వాత సిక్స్ ప్యాక్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను విస్మయానికి గురి చేసిన సునీల్ మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. అతని లైఫ్ చేంజ్ అవ్వడానికి బలమైన కారణం అల్లు అర్జున్ పుష్ప మూవీలో సునీల్ చేసిన విలన్ క్యారెక్టర్ అనే చెప్పాలి. ఫ్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందాం. భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీలో ఈ సునీల్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేసి సినిమా విజయంలో కూడా కీలక పాత్ర పోషించారు.

ఇప్పుడు పుష్ప సినిమాలో చేసిన విలన్ క్యారెక్టర్ సునీల్ ను అందరికీ బాగా దగ్గర చేసింది.ఇప్పటివరకు టాలీవుడ్ వరకు మాత్రమే పరిమితమైన సునీల్ పుష్ప సినిమా ద్వారా ఇతర చిత్రపరిశ్రమ వారికి కూడా బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా కోలీవుడ్ దర్శక నిర్మాతలు సునీల్ పై ఫోకస్ పెట్టారు. కోలీవుడ్ లో చాలామంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సునీల్ కావాలని పట్టు పడుతుండటం విశేషం. సునీల్ కోసం ప్రత్యేకమైన పాత్రలు సృష్టిస్తున్నారంటే ఎంతలా ఉందనేది అర్థమవుతుంది. తను నటించిన కోలీవుడ్ సినిమాలు కూడా సూపర్ హిట్ అవడం కూడా అతనికి బాగా కలిసి వచ్చింది. ఒకపక్క టాలీవుడ్, కోలీవుడ్ మూవీలను చేస్తూనే మరోపక్క పాన్ ఇండియన్ మూవీ కూడా వరుసగా చేస్తున్నాడు. ఇప్పుడు తెలుగు సినిమాల కంటే కోలీవుడ్ సినిమాలలోనే వరుసగా చేస్తున్నాడు. తాజాగా మరొక తమిళ్ మూవీ లో చేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల అయింది. ఆ చిత్ర యూనిట్ సునీల్ తమ సినిమాలో చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. లారెన్స్ తమ్ముడు ఎల్విస్ హీరోగా రూపొందనున్న బుల్లెట్ చిత్రంలోనూ సునీల్​కు మంచి క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంతో తెలుగమ్మాయి వైశాలి రాజ్ హీరోయిన్​గా పరిచయం అవుతోంది. ఇన్నసి పాండియన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో లారెన్స్​ కూడా క్యామియో రోల్​ పోషిస్తున్నారు. లా కాలేజీ బ్యాక్ డ్రాప్​లో ఇది రూపొందనుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్​హిట్​తో దూసుకెళ్తున్న జైలర్ లో సునీల్ వేసిన డంబ్ హీరో రోల్​ బాగా క్లిక్ అయింది. సెకండాఫ్ ఆయన కామెడీ బాగుందని అంటున్నారు. ఆయన పాత్రను ఆడియెన్స్​ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జైలర్ కన్నా ముందు వచ్చిన శివకార్తికేయన్ మహావీరుడులో కూడా ఓ మంత్రికి సెక్రెటరిగా కనిపించి ఆకట్టుకున్నారు. అందులో కూడా ఆయన నటన బానే ఉందని చెబుతున్నారు. కాస్త కామెడీ నెగటివ్​ టచ్​ ఉన్న పాత్రలో కనిపించారు. ఇంకా హీరో కార్తీ దొంగగా నటిస్తున్న కొత్త సినిమా జపాన్ లోనూ సునీల్ నటిస్తున్నారు. దీంతోపాటే ఈగై అనే మరో తమిళ చిత్రంలోనూ కనిపించనున్నారు. అలాగే శంకర్ తీసున్న గేమ్​ ఛేంజర్​లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక త్వరలోనే సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్న విశాల్ మార్క్ ఆంటోనీలో ఆయన నటించారు. ఇది కూడా మంచి పాత్ర అని చెన్నై టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన కెరీర్​ మంచి స్పీడ్​లో దూసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలతో పాటు సునీల్​ ఎక్కువగా కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ జోరు చూపిస్తున్నారు. ఆయనకు ఎక్కువగా తమిళ సినిమా ఆఫర్స్​ వస్తున్నాయి. ఇలా వరసుగా తమిళ సినిమాల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More