సెంటిమెంటే గెలిచింది

విశాఖ వేదికగా జరిగిన ఇండియా – సౌత్ ఆఫ్రికా టీట్వంటీ మ్యాచ్ లో సెంటిమెంటే విజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల టీట్వంటీ సిరీస్ లో వరుస రెండు విజయాలను నమోదు చేసిన సౌత్ ఆఫ్రికా విశాఖలో జరిగే మూడో మ్యాచ్ లోనూ ఇండియా ఫై విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. అటు ఇండియా కూడా వరుస రెండు మ్యాచ్ లలో సౌత్ ఆఫ్రికా దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో గట్టిగా పోరాడితే గాని సౌత్ ఆఫ్రికన్ కట్టడి చేయలేమని కూడా గ్రహించింది. చాలా మంది అభిమానులు కూడా ఇండియాకు ఈసారి గట్టి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఒక నిర్ణయానికి వచ్చేశారు. క్రికెట్ విశ్లేషకులు కూడా ఫిఫ్టీ- ఫిఫ్టీ ఛాన్స్ అని పేర్కొన్నారు. కానీ వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న సౌత్ ఆఫ్రికా మాత్రం మూడో మ్యాచ్ లో కూడా తమదే విజయం అని గట్టిగా భావించింది. మ్యాచ్ చివరకు వచ్చేసరికి ఊహించని మలుపు తిరిగింది. ఇండియా సౌత్ ఆఫ్రికా పై పట్టు సాధించడం ప్రారంభించింది. రెండో బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లను భారత్ పదునైన బౌలింగ్ తో కట్టడి చేసి 19.1 ఓవర్లలో అందరిని ఆల్ అవుట్ చేసి సునాయాస విజయం సాధించింది. విశాఖలో జరిగే మ్యాచ్ లలో భారత్ విజయం సాధించడం ఒక సెంటిమెంట్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 179 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా 180 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలో దిగి వెనువెంటనే వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. దీంతో 48 పరుగుల తేడాతో భారత్ సౌత్ ఆఫ్రికా పై విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆశలను సజీవం చేసుకుంది. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత్ 179 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు 19.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. రితురాజ్ గైక్వాడ్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. అదే సమయంలో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు డ్వేన్ ప్రిటోరియస్ ఖాతాలో చేరాయి. సౌత్ ఆఫ్రికా అంచనాలను పటాపంచలు చేస్తూ భారత్ ఆటగాళ్లు అన్ని విభాగాలలోను రాణించి సౌత్ ఆఫ్రికా ను మట్టి కరిపించారు. విశాఖ స్టేడియం భారత్ కు సెంటిమెంట్ గా అచ్చి వచ్చే వేదిక అని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా రుజువు చేశారు.. విశాఖ విడిఏ- ఏడిసిఏ వైస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం ప్రస్థానం దాయాదుల (పాకిస్థాన్‌) పోరుతో ప్రారంభమయింది. 2005, ఏప్రిల్‌ 5న ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరిగింది. ఇందులో టీమిండియా పాక్‌ను చిత్తు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు (ఏసీఏ) ఏకైక అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ఇదే కావడంతో బీసీసీఐ కేటాయించే మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. 2005లో తొలి వన్డేకు, 2012, సెప్టెంబరు 8న తొలి టీ20 మ్యాచ్‌కు, 2016 నవంబరు 17 నుంచి 21 వరకు తొలి టెస్టు మ్యాచ్‌కు వేదికైన ఈ స్టేడియంలో ఇప్పటివరకు రెండు టెస్టులు, పది వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. నేడు భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే టీ20 మ్యాచ్‌కు కూడా మరోసారి వేదికగా నిలిచింది. సుమారుగా ఇక్కడ జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం విశేషం.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More