అంటే…. అలా డిసైడ్ అయిందన్నమాట…

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ ఉన్న హీరో నేచురల్ స్టార్ నానీ. పక్కింటి పిల్లాడిలా ఇంట్లో మనిషి ల వుండే పాత్ర లతో తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకున్న ఈ నటుడికి ఈ మధ్య ఎందుకో సరైన సక్సెస్ దోబూచులాడుతూనే ఉంది. పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ నుంచి కమర్షియల్ హీరో గా ట్రాన్స్ఫార్మేషన్ వర్కౌట్ కాలేదు. శ్యామసింగరాయ్ తో మీసం తిప్పినా జనాలు అంతంత మాత్రంగానే రెస్పాన్డ్ అవ్వడం తో మళ్ళీ పాత రూట్ లొనే సహజనటన తో అంటే… సుందరానికి అంటూ ఆడియన్స్ ముందుకొచ్చాడు.. మొదటి మూడురోజులు ఓ మాదిరి గా స్పందించిన జనాలు తర్వాత థియేటర్లకు రావడానికి మొహం చాటేశారు.. సినిమా బావుందన్న టాక్ కాస్త మూడురోజులు దాటేసరికి మూడు మార్చేసుకుంది.. మొదటి ఆట నుంచి లెంగ్త్ ఎక్కువ అన్న ఆడియన్స్ బావుంది అన్న మాట ని మర్చిపోయి. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మొదలెట్టేశారు. ఓటీటీ లో వచ్చేస్తుంది కదా మూడు గంటలు థియేటర్ లో భరించే కన్నా ఇంట్లో ఫార్వర్డ్ చేసుకుని చూసేయడం బెటర్ అన్న నిర్ణయానికి ఆల్మోస్ట్ వచ్చేసారు. అంటే.. సినిమా ఓవరాల్ గా ఏభై శాతం మైలు రాయిని అతి కష్టం మీద దాటొచ్చని విశ్లేషకులు చెప్పేస్తున్నారు.. ఈ పరిస్థితి కి కారణం అయిన నిడివి విషయం లో నిర్మాతలు ముందే అలెర్ట్ అయినప్పటికీ లెంగ్త్ తగ్గించే విషయంలో డైరెక్టర్ ససేమిరా అనేసరికి అదే నిడివి ఉంచేసారని టాక్.. ముక్కి మూలుగుతూ టూ అవర్స్ డ్యూరేషన్ చూడటానికె ఇబ్బంది పడే ప్రేక్షకుడు మూడుగంటలు ఎలాచూస్తాడు.. ఎంత నవ్వించినా దూరంగానే జరిగాడు.. దానికి తోడు ఓటీటీ ఆశ ఉండనే ఉంది.. నిజానికి మేకర్స్ కి ఈ సినిమా ఓ లెసన్.. పుష్ప చూడలేదా..? అర్జున్ రెడ్డి చూడలేదా…? అన్న ప్రశ్న వేసేసుకుని మనదెందుకు చూడరు అనుకుంటే పొరపాటే.. అప్పటి పరిస్థితులు వేరు… లెక్కలు వేరు…

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More