విశాఖ సముద్ర తీరంలో పోర్టు మెరైన్ డిపార్ట్మెంట్ సర్వే కొనసాగుతుంది. సముద్ర నీటిమట్టంలో హెచ్చుతగ్గులు, ఇసుక కోతకు గురి కావడం, సముద్రంలో ఏర్పడుతున్న పరిణామాల పై ఈ సర్వే చేపడుతున్నారు. సర్వే నివేదిక ను డెహ్రాడూన్ సర్వే ఆప్ ఇండియా కి పంపిస్తారు. నివేదికను అక్కడ వారు పరిశీలించిన అనంతరం తదుపరి చేపట్టబోయే చర్యల గురించి సమీక్షించనున్నారు. ప్రతి నెల రెగ్యులర్ గా ఈ సర్వే నిర్వహిస్తున్నప్పటికీ తాజాగా సముద్ర నీటిమట్టం మరింతగా ముందుకు చోచ్చుకుని రావడం, తీర ప్రాంతం భారీగా కోతగా గురికావడం, ఇసుక రంగు మారడం వంటి కారణాలతో ప్రస్తుత చేస్తున్న సర్వే ప్రాధాన్యతను సంతరించుకుంది. సర్వే ఫలితంగా ఏడాది మొత్తం ఏ నెలలో, ఏ సమయంలో, ఏ వేళలో సముద్రంలోని హెచ్చుతగ్గులు ఏ మేరకు ఉంటాయన్నది స్పష్టత వస్తుంది. దీంతో సంబంధిత అధికారులకు ఈ డేటాను అందించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై తెలియజేస్తారు. గత ఏడాది కంటే ఈ ఏడాది మాత్రం విశాఖ లో సముద్రంపు నీరు మరింతగా ముందుకు చొచ్చుకు వచ్చింది. తీరంలోని కోకోనట్ పార్క్ దగ్గరకు నీరు చేరడంపై ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి తీరం వరకు చాలా చోట్ల తీర ప్రాంతం కోతకు గురైంది. కొన్ని మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. సర్వే తర్వాత వచ్చిన నివేదిక అనంతరం ఏటువంటి చర్యలు తీసుకోవాలో పోర్టు అధికారులకు నిర్దేశినం చేస్తారు. డాల్ఫిన్ నోస్ కొండ దగ్గర ప్రతి ఏడాది పెద్ద ఎత్తున తెల్లటి ఇసుక వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలో సముద్రంలో ఇసుక మేటలు పెద్ద ఎత్తున ఉండటం వలన లోతు తక్కువైపోవడం జరుగుతుంది ఈ కారణంతో అటువైపుగా వెళ్లే షిప్ లు ఇసుకలో చిక్కుబడి ముందు వెళ్లలేని పరిస్థితిలు ఏర్పడతాయి. అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను అక్కడి నుంచి తరలించి కోతకు గురైన ప్రాంతంలో ఆ ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా తరలిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఆరు నెలలకు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం విశాఖ తీరంలో అయితే తీర ప్రాంత పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఎప్పుడు లేనిది ఇటీవల చాలామంది సముద్రంలో గల్లంతవుతున్నారు. తీర ప్రాంతంలో గణనీయంగా లోతు పెరగడం, దీనికి తోడు బలమైన కెరటాలు తీరానికి చేరుకోవడం ప్రమాద ఘంటికలను సూచిస్తున్నాయి.