వాట్ నెక్స్ట్..?

ఎటువైపు ఆగస్టుతో ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు రాజకీయ భవిష్యత్‌పై చర్చ జరుగుతోంది. మాజీ అయిన తర్వాత బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు పదవులు.. ప్రాధాన్యత లభిస్తుందా ? ఆయన అనుభవాన్ని మోదీ, షాలు ఉపయోగించుకుంటారా? లేక ఇతర సీనియర్లలా రిటైర్మెంట్ లెక్కలోకి వెళ్లిపోతారా? అన్నది మేధావుల మస్తిష్కాన్ని తొలుస్తున్న ప్రశ్న. వెంకయ్యనాయుడు వయసు డెభ్బై మూడేళ్లు. బీజేపీ పెట్టుకున్న విధానం ప్రకారం 75 ఏళ్లు రిటైర్మెంట్ వయసు. ఈ కారణంతోనే వ్యవస్థాపక సీనియర్లను సైతం ఇళ్లకు పరిమితం చేశారు . కానీ వెంకయ్యనాయుడు రాజకీయ పరంగా మంచి వ్యూహకర్త. పార్టీ లో చిన్న స్థాయి కార్యకర్త నుండి పార్టీ జాతీయఅధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి గా ఎదిగారు. వెంకయ్యనాయుడు బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నిలబెట్టారు. అయితే రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఇది సరిపోదన్న వాదన వినిపిస్తోంది. వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతుంటే పార్టీ వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. అందుకే నేరుగా కాకపోయినా బీజేపీ కీలక నిర్ణయాల్లో భాగమయ్యే పరిస్థితి కూడా ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమని అంటున్నారు. వెంకయ్యనాయుడు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనని బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి. ఆయనకు ఇక ఎలాంటి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన మరో పదవి తీసుకోలేరు. ఆయన స్థాయికి తగ్గ పదవిని సృష్టించలేరు కూడా. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసినట్లేనని దాదాపు గా ఫిక్స్ అయిపోయారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా తన పదవీ కాలం చివరి రోజున భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెంకయ్యను పలు రకాలుగా పొగుడుతున్న బీజేపీ పెద్దలు ఆయన తర్వాత సేవలను ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నించలేదు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More