కర్ణాటక లో భిక్షాటన నిషేధం

ఇకపై కర్ణాటకలో భిక్షాటన చేసే వారు కనిపించార అంటే అవును అంటున్నాయి కర్ణాటక ప్రభుత్వ వర్గాలు. భిక్షాటన నిషేధ చట్టాన్ని సంపూర్ణంగా అమల్లోకి తీసుకురానున్నట్టు ఆ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి చెప్తున్నారు. దీనికి సంబంధించి హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, స్త్రీ శిశుసంక్షేమశాఖ మంత్రి హాలప్ప ఆచార్‌, కార్మికశాఖ మంత్రి శివరాం హెబ్బార్‌తో కలసి భిక్షాటన నిర్మూలన కోసం చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. చిన్నారులను దివ్యాంగులుగా మార్చి మరీ భిక్షాటన కోసం వినియోగిస్తున్నారన్న నివేదికలు కలకలం సృష్టిస్తున్నాయన్నారు. భిక్షాటన మాఫియాగా మారిందని, ఫలితంగా బాల నేరస్థులు పుట్టుకొస్తున్నారని మంత్రి చెప్తున్నారు ఒక్క బెంగళూరు నగరంలోని 70 చోట్ల భిక్షాటన సాగుతొందని గత కొద్ది నెలలుగా భిక్షాటన చేస్తున్న 101 మంది చిన్నారులను రక్షించి బాల పునరావాస కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. ఇటీవల తమకు సమర్పించిన ఒక నివేదికలో బెంగళూరు నగరంలో 720 మంది చిన్నారులు భిక్షాటన చేస్తున్నట్టు తెలిసిందన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని 1098 నెంబరుకు పౌరులు అందచేస్తే తక్షణం చర్యలు తీసుకునేలా ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను సిద్ధం చేశామన్నారు. బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భిక్షాటన చేస్తున్న చిన్నారుల తాజా సమాచారాన్ని అందచేయాల్సిందిగా పోలీసుశాఖకు సూచించామని హోం మంత్రి చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తే యాచకులు లేని రాష్ట్రంగా కర్ణాటక త్వరలో కనిపించబోతోంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More