వర్షాలు విపరీతం గా కురిసే సమయం లో వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి. ఆ నీరంతా భారీ ప్రోజెక్టు లకు చేరితే అక్కడ కూడా నిర్ణీత పరిధి ని మించితే అప్పుడు గేట్లను ఎత్తి నీటి ని కిందికి వదలడం మామూలే ఇలాంటప్పుడు మనకి వినపడే పదాలు టీఎంసీ , క్యూసెక్కులు. అసలు వీటికొలమానం ఏంటి..? లెక్కేంటి..? ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటి పరిమాణం చెప్పడానికి ఉపయోగించే ప్రమాణం – టీఎంసీ. అంటే థౌజెండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ శతకోటి(వంద కోట్ల) ఘనపుటడుగులు అని అర్థం. ఒక టీఎంసీ అంటే 2,80,00,000 క్యూబిక్ మీటర్లు. క్యూసెక్కు అంటే సెకను కాలంలో ప్రవహించే ఘనపుటడుగుల నీరు( క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్) అని అర్థం. ఒక సెకను వ్యవధిలో ఘనపుటడుగుల నుంచి ప్రవహించే నీరు 28 లీటర్లు. ఏదైనా ఒక రిజర్వాయరు నుంచి కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీరు 24 గంటల పాటు ప్రవహిస్తే ఒక టీఎంసీ నీరు వెళ్లిపోతోంది. ఇదండీ లెక్క.