క్రాస్ బ్రీడ్ సాలా అంటూ దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతున్న లైగర్ చిత్రం లో విజయ్ దేవరకొండ కి నత్తి పెట్టడం క్యారెక్టర్ లో భాగమనుకుని అభిమానులు సంబరపడిపోయినా చాలామంది నెటిజన్లు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మేకింగ్ పరం గా హైవోల్టేజ్ బిల్డప్ ఇచ్చి హీరో ని ఇలా నత్తి గా మాట్లాడించడం నచ్చలేదని కొంతమంది బహిరంగంగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు చెముడు, రేచీకటి, మతిమరుపు, అయిపోయాయి ఇప్పుడు నత్తి వంతు వచ్చిందా అని మీమ్స్ ఏసేనుకుంటున్నారు. అయితే ఇదిలా ఉండగా లైగర్ లో నత్తి అనే ఎలిమెంట్ విజయ్ కోసం ప్రత్యేకంగా యాడ్ చేసిందేమీ కాదని ఈ కధ పుట్టిన దగ్గర నుంచే హీరో క్యారెక్టర్ కి నత్తి ఉండేలా డైరెక్టర్ పూరి డిజైన్ చేశాడట. చాలా మంది హీరో లను ఈ సినిమా కోసం అనుకుని ఓ ఆరేడు సంవత్సరాల క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ లైన్ చెప్పాడట. అప్పటి సిట్యుయేషన్స్ బట్టి చెయ్యకూడదు అనుకున్న ఎన్టీఆర్ నత్తి ఎలిమెంట్ ని జై లవకుశ చిత్రం లో దర్శకుడికి చెప్పి ఇంప్లిమెంట్ చేశాడట.. కధ పుట్టినప్పుడే క్యారెక్టర్ ను ఫిక్స్ అయిపోయిన పూరి ఇన్ని సంవత్సరాలు అయినా మళ్ళీ దాన్నే తెరకెక్కించాడు. బలం గా నమ్మి రాసుకున్న నత్తి క్యారెక్టర్ పూరి ని బయటపడేస్తుందా లేదా…? అనేది చూడాలి మరి.