వదినమ్మ మాట్లాడవేందమ్మా..?

ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు సంధిస్తున్న సూటి ప్రశ్న ఇది..! చంద్రబాబు ఆస్తుల వెల్లడి కేసులో సుప్రీంకోర్టులో నేను ఎన్టీఆర్ సతీమణిని అని హక్కుగా చెప్పిన లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పేరు తొలగింపు పై, విగ్రహాల విధ్వంసం పై ఎన్టీఆర్ భార్య హోదా లో స్పందించకపోవడం పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత అన్న క్యాంటీన్లు రద్దు దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు ఇమేజ్ కి డామేజ్ అయిన పనులు చాలానే జరిగాయి ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ మానస పుత్రిక దేశంలోనే తొలి ఆరోగ్య విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం పెద్ద దుమారాన్ని రేపింది ఎప్పుడో ముప్పైఆరు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి స్వయంగా ఎన్టీఆర్ ఛాన్సలర్ గా ఉండి తీర్చిదిద్దిన విశ్వవిద్యాలయానికి అస్సలు ఏ మాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ పేరుని పెట్టడం సగటు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా కలిసి వేసిందనే చెప్పాలి.. అలాంటిది సతీమణిని అని అధికారం గా చెప్పుకున్న తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడంపై ఎన్టీఆర్ అభిమానులు విరుచుకుపడుతున్నారు గతంలో కూడా ఓ ప్రాంతం లో ఎన్టీఆర్ విగ్రహ కూల్చివేతపై ఫోన్ ద్వారా లక్ష్మీపార్వతి తెలియజేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేసిన ఆడియో బాగానే వైరల్ అయింది. అన్న క్యాంటీన్ విషయంలో కూడా ఆవిడ మౌనం గానే ఉన్నారు తప్పా ఏ రోజు నోరు మెదప లేదు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినప్పుడు భజన చేసిన ఆమె ఎన్టీఆర్ పేరుకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా రెస్పాండ్ అవ్వాలి కదా అన్నది అభిమానుల సూటి ప్రశ్న ఎన్టీఆర్ అనే అక్షరాలు ఒకప్పుడు తెలుగుదేశం సొత్తు కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం తెలుగువారి ఆస్తి అలాంటప్పుడు తెలుగు వాళ్ళందరూ ఒక్కటై స్పందిస్తున్నప్పుడు సహధర్మచారిణి గా నిరసన తెలియజేయకపోవడం కుటిల రాజకీయానికి నిదర్శనమే మరి. నందమూరిని ఇంటిపేరుగా ధరించిన లక్ష్మీపార్వతికి ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమని చంద్రబాబుపై ఉన్న ద్వేషం డామినేట్ చేస్తున్నంతకాలం ఎన్టీఆర్ అభిమానులు ఆమెను క్షమించలేరు. చంద్రబాబు బృందం నుంచి ఎన్టీఆర్ ని వేరు చేయాలన్న ప్రయత్నంలో కొంతవరకు ఆవిడ పార్టీ సఫలీకృతమైన ఎన్టీఆర్ గౌరవాన్ని లాగేసుకునే ప్రయత్నం మాత్రం హర్షనీయం కాదు… సమర్ధనీయం అంతకన్నా కాదు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More